విమానంలో నెట్ చార్జీలు ఖరీదే

Share

(న్యూస్ ఆర్బిట్‌ బ్యూరో)
విమానంలో రెండు గంటల పాటు ఫోన్‌కాల్స్‌/ఇంటర్‌నెట్‌ వాడుకునేందుకు రూ.700-1,000 వరకు చెల్లించాల్సి రావచ్చని బ్రాడ్‌కాస్టింగ్‌ టెక్నాలజీ సంస్థ హ్యూస్‌ ఇండియా చీఫ్‌టెక్నాలజీ అధికారి కె కృష్ణ అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రపంచంలో ఇదే సదుపాయం అందుబాటులో ఉన్న ఇతర దేశాలతో పోలిస్తే, శాటిలైట్‌ బ్యాండ్‌విడ్త్‌ ఛార్జీలు మన దగ్గర 7నుండి 8 రెట్లు అధికం కావడమే ఇందుకు కారణం అని వివరించారు. ఇండియన్‌ స్పేస్‌ రీసెర్చ్ ఆర్గనైజేషన్‌ (ఇస్రో) నుంచి మాత్రమే బ్యాండ్‌విడ్త్‌ను కొనుగోలు చేయాలని నిర్ణయించడమే ఈ పరిస్థితికి కారణమన్నారు. అందుబాటు ధరల్లో ఉంటేనే ఈ సేవలను విమాన ప్రయాణికులు వినియోగించుకుంటారని, శాటిలైట్‌ బ్యాండ్‌విడ్త్ ఎవరి దగ్గరైనా తీసుకునేందుకు అనుమతిస్తే ఇది సాధ్యమవుతుందన్నారు.  దేశీయ పరిధిలో విమానాలు, నౌకల్లో మొబైల్‌ సేవలు అందించే లైసెన్స్‌ కోసం హ్యూస్‌ కూడా దరఖాస్తు చేసింది. అంతర్జాతీయంగా చూస్తే, విమానాల్లో మొబైల్‌ ఫోన్లను 10 శాతం మంది వినియోగించుకుంటున్నారని తెలిపారు.


Share

Related posts

‘పోలవరంపై విచారణ చేయించండి’

somaraju sharma

Bigg boss Lasya : మహిళల గొప్పదనం ఇది.. లాస్య మంజునాథ్ మహిళా దినోత్సం స్పెషల్ వీడియో?

Varun G

పోలవరం గిన్నిస్ రికార్డు!

somaraju sharma

Leave a Comment