Naresh: సీనియర్ నటుడు నరేష్ ని విజయ నరేష్ అనికూడా అంటారు. ఎందుకంటే, ఇతను నటి విజయ నిర్మల కుమారుడు. అనేక తెలుగు చిత్రాలలో హాస్య ప్రధాన పాత్రలు పోషించిన ఇతడు ప్రస్తుతం తండ్రి పాత్రలకు పరిమితమైపోయాడు. ముఖ్యంగా జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన అనేక విజయవంతమైన చిత్రాలలో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. కాగా ఇతని వివాహము 3 సార్లు జరిగిందనే విషయం చాలా మందికి తెలియదు.
Weight Loss: పన్నీర్, గుడ్డు ఈ రెండింటిలో ఏది తింటే త్వరగా బరువు తగ్గుతారో తెలుసా..!?
Naresh: నరేష్ మాజీ భార్యపై కేసు?
ఇకపోతే నరేష్ మాజీ భార్య అయినటువంటి రమ్య రఘుపతిపై తాజాగా పోలీసు కేసు నమోదైంది. నరేష్ పేరుతో డబ్బు వసూలు చేస్తోందంటూ 5 మంది మహిళలు హైదరాబాదులోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా పోలీసులు రంగంలో దిగి ఆమెను అరెస్ట్ చేసారు. హిందూపూర్, అనంతపూర్, హైదరాబాద్ లో భారీగా డబ్బు వసూలు చేసినట్టు ఆమెపై ఆరోపణలు అనేకం ఉన్నాయి. కాగా నరేష్ కు రమ్య రఘుపతి 3వ భార్య. మాజీ మంత్రి రఘువీరారెడ్డి తమ్ముడి కుమార్తె ఈమె.
Social Media : సోషల్ మీడియా విషయంలో ట్రంప్ కీలక ముందడుగు
వీరి వివాహం తంతు:
8ఏళ్ల క్రితం ఆమెను నరేశ్ వివాహం చేసుకున్నారు. అంటే సుమారు 50 ఏళ్ల వయసులో పెళ్లాడారు. అయితే కొంత కాలంగా వీరు దూరంగా ఉంటున్నట్టు తెలుస్తోంది. నరేష్ కు చెందిన ఆస్తులను చూపుతూ, ఈ ఆస్తులు తనకే చెందుతాయని వారిని నమ్మబలికి చాలా మంది నుంచి ఆమె డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు వున్నాయి. ఇకపోతే, దీనిపై నరేష్ తాజాగా స్పందిస్తూ.. రమ్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ఇకపోతే నరేష్ మొదటి పెళ్లి సీనియర్ కెమెరామెన్ శ్రీను కుమార్తెతో జరిగింది.