ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

నిమ్మగడ్డ మాస్టర్ ప్లాన్..! పదవిలో ఉండేలా కొత్త పావులు..!!

Share

 

ఏపీలో ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ తన పదవీ కాలాన్ని పొడిగించుకునే ప్రయత్నాల్లో ఉన్నారని జోరుగా విన్పిస్తోంది.

నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆ పదవిలో ఉన్నంతకాలం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకూడదన్న పట్టుదలతో జగన్ ప్రభుత్వం ఉండగా…తన హయాంలోనే ఈ ఎన్నికలు జరపాలని ,అందుకు అవసరమైతే తన పదవీకాలాన్ని కోర్టుకెళ్లడం ద్వారా పొడిగించుకోవాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎత్తుకు పైఎత్తు వేసుకున్నారట. జగన్‌ ప్రభుత్వం తనను మూడు నెలల పాటు తన విధులు నిర్వర్తించకుండా తప్పించింది కాబట్టి, ఆ మూడు నెలల పదవీ కాలాన్ని పెంచాల్సిందిగా నిమ్మగడ్డ కోర్టు ముందు వాదించుకోవడానికి సిద్ధమైనట్లుగా సమాచారం.

ఉన్నట్టుండి మారిన నిమ్మగడ్డ వ్యవహారశైలి!

అసలు నిమ్మగడ్డ వ్యవహారశైలిలో గత వారం రోజులుగా చాలా మార్పు వచ్చింది .జగన్ ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకునే రీతిలో ఆయన ముందుకెళ్తున్నారు.తనకున్న విస్తృత అధికారాలను ఉపయోగించి ఎన్నికల కమిషన్లోని ఇద్దరు ఉన్నతాధికారులపై ఆయన వేటు వేశారు .ఏకంగా ఎన్నికల కమిషన్ కార్యదర్శి వాణిమోహను ని సరెండర్ చేశారు .ఆమె కూడా ఐఏఎస్ అధికారే కాకుండా గతంలో జిల్లా కలెక్టర్గా సైతం పని చేసిన హిస్టరీ ఉన్న అధికారిణి.నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని పదవి నుండి తొలగించి ఆయన స్థానంలోజగన్ ప్రభుత్వం జస్టిస్ కనకరాజును నియమించిన సమయంలో వాణిమోహన్ ను ఎన్నికల కమిషన్ కార్యదర్శిగా పోస్ట్ చేశారు.అయితే ఆమె తన వ్యవహార శైలిపై ఒక కన్నేసి ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తోందన్న అనుమానంతో నిమ్మగడ్డ రమేష్కుమార్కు ఆమె ఆమె సేవలు తమకు అవసరం లేదంటూ ప్రభుత్వానికి సరెండర్ చెయ్యడం జరిగింది .

ప్రభుత్వంతో గొడవే ఆయన అజెండానా?

ఆయన ధోరణి గొడవ.. వివాదమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నట్టు ఖరారు చేసుకోవచ్చు.తన నియామకానికి మూలకారులకు కృతజ్ఞత తీర్చుకోవడానికే కావొచ్చే లేదా తన ‘వారి’ కోసం కృషి చేసే స్వభావం కావొచ్చు.. కారణం ఏదైనా గానీ ప్రజల ఓట్లతో గెల్చి సీయం అయిన జగన్‌ ప్రభుత్వంతో మాత్రం గొడవలే లక్ష్యంగా..వివాదమే మార్గంగా ఆయన వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిపోయింది.టీడీపీ నాయకులతో మంతనాలు, వారితో సన్మానాలు తదితర వ్యవహారాలు బైట పడ్డాక ఆయనపై అనుమానాలు పెరగడానికి కారణాలుగా నిలుస్తున్నాయి. ఎన్ని ఆరోపణలు వస్తున్నప్పటికీ ఆయన కూడా తన దోరణి తనదేనన్నట్టుగా ముందుకు పోతున్నారు.అయితే తన చర్యల ద్వారా నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన ఇమేజ్ ను తానే పాడుచేసుకుంటున్నారన్న వ్యాఖ్యలు వినవస్తున్నాయి.మొదట్లో ఆయనపై ఒకరకమైన సానుభూతి ఉండేది.జగన్ ప్రభుత్వం ఆయనను వేధిస్తున్నట్లు కొందరు అభిప్రాయపడేవారు.కానీ ఇప్పటి పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే రమేష్ కుమారే వైసిపి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు సాగిస్తున్నారని ప్రజలు నమ్మే వాతావరణం ఏర్పడింది.

 


Share

Related posts

YSRCP: మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు.. ఆ మీడియాలపై బహిష్కరణ వేటు

somaraju sharma

అమెరికా 46వ అధ్యక్షుడుగా ప్రమాణ స్వీకారం చేసిన జో బైడెన్

somaraju sharma

జ‌గ‌న్‌కు కేంద్రం గుడ్ న్యూస్‌… నిజంగా తీపి క‌బురే

sridhar
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar