NTR: కమెడియన్ ఆలీ తో సరదాగా షో లో చాలామంది సెలబ్రిటీలు వస్తుంటారు. షో లో భాగంగా తాజాగా హీరోయిన్ సదా రావడం జరిగింది. ఈ సందర్భంగా తన కెరీర్ గురించి.. వ్యక్తిగత విషయాలు గురించి అనేక విషయాలు సదా చెప్పుకు రావడం జరిగింది. ఇదిలా ఉంటే యంగ్ టైగర్ ఎన్టీఆర్ పై సదా సంచలన కామెంట్ చేసింది.
తన జీవితంలో తన సినీ కెరీర్ లో అటువంటి వ్యక్తిని ఎక్కడా చూడలేదని చెప్పుకొచ్చింది. ఎన్టీఆర్ తో నాగ సినిమా చేయటం జరిగిందని ఆ షూటింగ్ జరుగుతున్న సమయంలో..డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న టైంలో.. అంత బాగా కష్టపడి ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాళ్ళం.. కానీ ఎన్టీఆర్.. కొరియోగ్రాఫర్ ఒక మూమెంట్ చెప్పగానే.. అసలు ప్రాక్టీస్ లేకుండా డైరెక్ట్ గా కెమెరా ముందు సింగల్ టేకింగ్ లో చేసి వెళ్ళిపోయేవారు.
Read more: NTR: ఎన్టీఆర్ తో మూడో అతి పెద్ద భారీ ప్రాజెక్టు చేపట్టబోతున్న ఆ నిర్మాణ సంస్థ..??
అసలు నా జీవితంలో అటువంటి డాన్సర్ ఇప్పటివరకు ఎప్పుడూ చూడలేదు. ఎంత పెద్ద మూమెంట్ అయినా సరే సింగిల్ టేక్ లో చేసి వెళ్ళిపోతారు. మరి ఆయన బయట రిహార్సల్ చేసి వస్తారు ఏమో తెలియదు.. మాకైతే చిన్నచిన్న మూమెంట్స్ మైండ్ లో పెట్టాలంటే చాలా టైం పడుతోంది. అయినా కానీ అంత పెద్ద నందమూరి ఫ్యామిలీ నుండి వచ్చిన ప్రతి ఒక్కరి తో ఎన్టీఆర్ చాలా చక్కగా మాట్లాడతారు అని చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటారు. అంతే కాకుండా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అంటూ ఎన్టీఆర్ పై హీరోయిన్ సదా పొగడ్తల వర్షం కురిపించింది.