మన సినీ తారలు ఆయా పాత్రలకు తగ్గట్టు వారి శరీరాన్ని మార్చుకుంటూ ఉంటారు. అంత అంకిత భావంతో సినిమాలు చెయ్యడం వలనే మనం వారిని సూపర్ స్టార్స్ అంటాము. ఒక్కోసారి లావుగా కనపడడానికి వెయిట్ పెరిగి ఇంకొక పాత్ర కోసం చాలా సన్నపడుతూ ఉంటారు. ఇందుకోసం వారు బాగా కష్టపడతారు కూడా. ఇలాగే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా ఇప్పుడు ‘వకీల్ సాబ్ ‘ షూటింగ్ కోసం సన్నబడడానికి చాలా ప్రయత్నిస్తున్నారు.
హిందీలో సూపర్ హిట్ గా నిలిచిన ‘పింక్’ సినిమా ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. లాక్ డౌన్ ముందే చాలా వరకు షూటింగ్ పూర్తయిపోయింది. లాక్ డౌన్ తర్వాత ఈ మధ్యే షూటింగులు పునః ప్రారంభం కావడంతో పవన్ పాల్గొనగా కోర్టు సన్నివేశాలను చిత్రీకరించారు. ఇక ఆయనకు సంబంధించి సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మాత్రమే చిత్రీకరించాలిసి ఉందట. ఈ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కోసం ఆయన సన్నగా కనిపించడానికి ప్రస్తుతం పవన్ ప్రత్యేకమైన లిక్విడ్ డైట్ ను అనుసరిస్తున్నారట. ఈ నెల మూడో వారం నుంచి ఈ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చిత్రీకరణ మొదలవుతుందట.