NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ

Janasena : పవన్ వద్దంటున్నా నువ్వే మా నాయకుడు అంటున్నారు…! సూపర్ రాజకీయం

Janasena :   పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టినప్పుడే తను అందరిలాంటి రాజకీయ నాయకుడిని కాదని… తనకు ఎటువంటి కులాలను అంటగట్టవద్దని…. కులరహిత రాజకీయాలు చేస్తానని చెప్పారు. అత్యంత వీరావేశంతో పార్టీ స్థాపించిన అతను తనని తాను అభినవ రాజకీయ నేతగా చెప్పుకున్నారు. అయితే తనకు ఏ కులము…. మతము లేదని చెప్పిన ఆయన తనకి కులం అనే రాటను కట్టేస్తారా? సంకుచితంగా వ్యవహరిస్తారా? అంటూ ప్రతిపక్షం పై కూడా చాలా సార్లు విరుచుకుపడ్డారు.

 

pawankalyan Kapu community supports Janasena
pawankalyan Kapu community supports Janasena

కాపులే కాపాడారు

అయితే పవన్ తనకు ఏ కులం అయితే వద్దు అన్నారో వారి అతనిని నెత్తిన పెట్టుకున్నారు. ఆ సామాజికవర్గం ఇప్పుడు పవన్ పార్టీని పంచాయతీ ఎన్నికల్లో తమ భుజాలపై మోసింది. జనసేన పార్టీ పంచాయతీ ఎన్నికల్లో ఇంతగా రాణించడానికి ఆ పార్టీ పరువు నిలబడడానికి కారణం కేవలం కాపు సామాజిక వర్గం అన్నది మాత్రం వాస్తవం. దీనికి ప్రత్యేక ప్రత్యేక ఉదాహరణ జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్.

అంతా వారి చలవే…

కాపులు ఎక్కువగా ఉండే తూర్పుగోదావరిలో తన పార్టీ మద్దతుదారులు గా ఉండి గెలిచిన వారికి సన్మానం చేయడమే కాకుండా ఎంత కాదనుకున్నా పవన్ కు కాపుల అండ చాలా అవసరం అని పరోక్షంగా అంగీకరించినట్లు అయింది. ఉభయగోదావరి జిల్లాల్లో కాపు సామాజిక వర్గం మొత్తం మరో పార్టీ లేదన్నట్లు జనసేన వైపు నిలబడింది. నెల్లూరు సహా గోదావరి. కృష్ణా జిల్లాల్లో కూడా జనసేన మద్దతుదారులు వీరి వల్లే విజయం సాధించారు.

పవన్ కూ అవసరమే….

పంచాయతీ ఎన్నికలపై అసలు జనసేన అంతగా ఆశలు పెట్టుకోలేదు కానీ నాలుగు దశల్లో ఎన్నికలు ముగిసిన తర్వాత ఫలితాలను విశ్లేషిస్తే జనసేనను గెలిపించింది కేవలం కాపు సామాజిక వర్గానికి చెందిన వారు మాత్రమే కావడం విశేషం. అయితే ఇప్పుడు కాపులను ఎంతైనా ఓన్ చేసుకోవాల్సిన అవసరం పవన్ కు ఏర్పడింది. తన రాజకీయ జీవితంలో కీలకమైన దశ మొదలైన నేపథ్యంలో అతనికి వారి అవసరం ఎప్పుడూ ఉంటుంది. వారు కూడా అతని అవునన్నా.కాదన్న తమ నాయకుడిగా ఇప్పటికే ఫిక్స్ అయిపోయారు.

మరి పవన్ నిర్ణయం ఏంటి?

గత ఎన్నికల పరిస్థితి ఎలా ఉన్నా…. ఇప్పుడు మాత్రం కాపులు ఒక క్లారిటీ ఇచ్చేశారు. ఎట్టి పరిస్థితుల్లో టిడిపి వైపు వెళ్లేది లేదని… జనసేన పై నమ్మకం పెట్టుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ని గెలిపించుకున్న వారు… ఇప్పుడు పంచాయితీ ఎన్నికల పరిస్థితిని చూస్తే వారిని కూడా పక్కన పెట్టినట్లు స్పష్టం అవుతోంది. కాబట్టి ఎలా చూసుకున్నా కాపులంతా జనసేన వైపే…. మరి పవన్ వైపు నిలబడతారా…. లేదా… అనేది చూడాలి.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N