Thomas Cup: థామస్ కప్ గెలిచి చరిత్ర సృష్టించిన భారత పురుషుల బాడ్మింటన్ బృందానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ఏపి సీఎం వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రధాన మంత్రి మోడీ స్వయంగా టీమ్ కు ఫోన్ చేసి అభినందలు తెలియజేశారు. భారత్ ను విజేతగా నిలిపి 135 కోట్ల మంది భారతీయులకు గర్వకారణంగా నిలిచారని ఈ సందర్భంగా వారితో అన్నారు. దాదాపు పది నిమిషాల సేపు మోడీ క్రీడాకారులతో మాట్లాడారు. ఈ వీడియోను స్వయంగా మోడీనే తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు.
భారత బాడ్మింటన్ లో ఇదో చారిత్రక ఘట్టంగా అభివర్ణించారు ఏపి సీఎం వైఎస్ జగన్. బాడ్మింటన్ లో 73 ఏళ్ల భారత భారత కలను సాకారం చేసినందుకు గానూ కిదాంబి శ్రీకాంత్ అండ్ టీమ్ ను ట్విట్టర్ వేదికగా సీఎం జగన్ అభినందించారు. ఫైనల్ లో జరిగిన కీలక మ్యాచ్ లో అద్భుత విజయం సాధించిన శ్రీకాంత్ ను సీఎం జగన్ ప్రత్యేకంగా ప్రశంసించారు.
కాగా భారత షట్టర్లు పురుషుల బాడ్మింటన్ లో సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు. 73 ఏళ్ల థామస్ కప్ చరిత్రలో భారత బాడ్మింటన్ జట్టు తొలి సారి స్వర్ణ పతకాన్ని కైవశం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్ లో 14 సార్లు ఛాంపియన్ గా ఉన్న ఇండోనేషియాను 3-0 తేడాతో మట్టికరిపించి థామస్ కప్ 2022 స్వర్ణాన్ని భారత్ టీమ్ చేజిక్కించుకుంది.
Dil Raju: టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ నిర్మాతలలో దిల్ రాజు(Dil Raju) ఒకరు. తన బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్…
Today Horoscope: జూలై 5 - అషాడమాసం - మంగళవారం మేషం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో…
Samantha Tapsee: హీరోయిన్ తాప్సి(Tapsee) అందరికీ సుపరిచితురాలే. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు(Raghavendra Rao) దర్శకత్వంలో మంచు మనోజ్(Manoj) హీరోగా నటించిన "ఝుమ్మంది…
God Father: మలయాళంలో మోహన్ లాల్(Mohan Lal) ప్రధాన పాత్రలో నటించిన "లూసిఫర్"(Lucifer) తెలుగులో "గాడ్ ఫాదర్"(God Father)గా తెరకెక్కుతోంది.…
Ram Pothineni Boyapati: బోయపాటి(Boyapati Srinivas) దర్శకత్వంలో రామ్ పోతినేని(Ram Pothineni) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రామ్ కెరియర్…
Upasana: ప్రముఖ ఆధ్యాత్మిక గురువు సద్గురు(Sadguru) ప్రపంచవ్యాప్తంగా సేవ్ సాయిల్ పేరిట పర్యటనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో…