NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP Rajya Sabha: ఆ రేసులో ఆదానీ ఫ్యామిలీ లేదు(ట)..! ఇక ఆ ఒక్కటి ఎవరికి అంటే..?

YSRCP Rajya Sabha: ఏపిలో ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎలక్షన్ షెడ్యుల్ విడుదల అయిన సంగతి తెలిసిందే. ఈ నాలుగు స్థానాలు వైసీపీకే దక్కనున్న నేపథ్యంలో చాలా కాలంగా ఒక స్థానం ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం అదానీ కుటుంబానికి జగన్ కన్ఫర్మ్ చేశారంటూ ప్రచారం జరుగుతోంది. దీనిపై ఆ పార్టీ నుండి ఎవరూ ఖండించలేదు. ఇంతకు ముందు అంబానీ సిఫార్సు మేరకు పరిమళ్ నత్వానికి రాజ్యసభ సీటు ఇచ్చిన నేపథ్యంలో ఈ సారి గౌతమ్ ఆదానీ సతీమణి ప్రీతి అదానీ లేక ఆయన కుమారుడికి వైసీపీ రాజ్యసభ ఇవ్వనుందని ప్రచారం జరిగింది. అదే విధంగా విజయసాయి రెడ్డికి మరో సారి అవకాశం ఇవ్వనున్నారనీ, బీసీ సామాజికవర్గానికి చెందిన బీదా మస్తాన్ రావు, కేంద్ర మాజీ మంత్రి కిళ్లి కృపారాణిల పేర్లు దాదాపు ఖరారు అయినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి.

Adani family not in YSRCP Rajya seat Sabha
Adani family not in YSRCP Rajya seat Sabha

YSRCP Rajya Sabha: ఆదానీ ఫ్యామిలీకి ఆసక్తి లేదు

అయితే ఆదానీ ఫ్యామిలీ రాజ్యసభ రేసులో లేరని స్పష్టం అయ్యింది. మీడియాలో వస్తున్న కథనాలను ఆదానీ గ్రూపు ఖండించింది. మీడియాలో కథనాలపై ఆదానీ గ్రూపు ట్విట్టర్ వేదికగా స్పందించింది. గౌతమ్ ఆదానీ గానీ ఆయన భార్య ప్రీతి అదానీ గానీ ఎలాంటి రాజకీయ పార్టీలో చేరబోవడం లేదని వారికి రాజకీయ ఆసక్తి లేదని అదానీ గ్రూపు అధికారికంగా ప్రకటించింది. ఆదానీ కుటుంబం నుండి ఇద్దరిలో ఒకరు రాజ్యసభకు వెళ్లబోతున్నారంటూ వస్తున్న ప్రచారం అవాస్తమని ప్రకటించింది. ఆదానీ ఫ్యామిలీ రాజ్యసభలో లేరని స్పష్టం అవ్వడంతో ఆ ఒక్క సీటు ఎవరికి ఇస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది.

ఆ ఒక్కటీ మైనార్టీ లేదా ఎస్సీ సామాజిక వర్గ నేతకే కన్ఫర్మ్..?

ఇప్పటికే ఇద్దరు బీసీ, ఒక రెడ్డి సామాజికవర్గానికి కన్ఫర్మ్ అయినట్లు ప్రచారం జరుగుతుండగా మిగిలిన ఒకటి ఎస్సీ, లేదా మైనార్టీలకు అవకాశం కల్పించవచ్చని అంటున్నారు. ఇప్పటికే ఏపి సీఎం వైఎస్ జగన్.. సినీనటుడు ఆలీకి ఓ నామినేటెడ్ పదవి హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మైనార్టీ కోటా నుండి ఆయనకు అవకాశం ఇస్తారా లేక పార్టీలో ఎస్సీ నేతల్లో ఒకరికి అవకాశం ఇస్తారా అనే దానిపై చర్చ జరుగుతోంది. ఈ నెల 20వ తేదీ నుండి జగన్ విదేశీ పర్యటనలకు వెళ్లనున్న నేపథ్యంలో ఈ లోపుగా రాజ్యసభ అభ్యర్ధులను అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju