NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవలె `ఆర్ఆర్ఆర్`తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కెరీర్లో తొలి పాన్ ఇండియా చిత్రమిది. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ మూవీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరో హీరోగా నటించాడు. భారీ అంచనాల నడుమ మార్చి 25న ప్రక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అన్ని భాషల్లోనూ సూపర్ హిట్‌గా నిలిచింది.
ఈ మూవీతో ఎన్టీఆర్ నేషనల్ వైడ్‌గా పాపులర్ అయిపోయారు. అంతేకాదు, తాజాగా ప్రభాస్, మహేష్ బాబు, బన్నీ వంటి హీరోలను వెనక్కి నెట్టి టాప్ 1లో తన పేరును రిజిస్టర్ చేసుకున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ప్రముఖ సర్వే సంస్థ ఆర్ మాక్స్ మీడియా టాలీవుడ్లో మోస్ట్ పాపులర్ మేల్ స్టార్స్ ఎవరు అనే సర్వేను ప్రతి సంవత్సరం నిర్వహిస్తుంటుంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఈ సర్వేలో ఎప్పుడూ మహేష్, అల్లు అర్జున్, ప్రభాస్‌లు టాప్ పొజిషన్స్ కోసం పోటీపడేవారు. కానీ, ఈ సారి మాత్రం వారిని వెనక్కిని నెట్టి అనూహ్యంగా ఎన్టీఆర్ టాప్ 1 స్థానంలోకి దూసుకువచ్చి రికార్డు సృష్టించారు. ఇక రెండొవ స్థానాన్ని ప్రభాస్ దక్కించుకోగా.. ఆపై బన్నీ, రామ్ చరణ్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, నాని, విజయ్ దేవరకొండ, చిరంజీవి, రావితేజలు వరసగా నిలిచారు.
కాగా, గత నాలుగేళ్లగా ఎన్టీఆర్ నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు. అయితే ఎప్పుడైతే ఆర్ఆర్ఆర్ విడుదలైందో.. అప్పటినుంచో తన క్రేజ్‌ను అమాంతం పెంచేసుకున్నాడు. ఇప్పుడు ఈ క్రేజే ఎన్టీఆర్‌ను టాప్ పొజిషన్లో నిలబెట్టింది. ఈ నేపథ్యంలోనే నందమూరి ఫ్యాన్స్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సాధించిన ఈ ఘనతను చూసి తెగ మురిసిపోతున్నారు.
Ormax Stars India Loves: Most popular male Telugu film stars (Apr 2022) #OrmaxSIL pic.twitter.com/wxyhPygor6
— Ormax Media (@OrmaxMedia) May 15, 2022