Poonam Pandey: పూనమ్ పాండే.. ఈమధ్య సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్న బీ టౌన్ బేబీ. పూనమ్ కొన్ని రోజుల క్రితమే తన మాజీ భర్త అయినటువంటి సామ్ బాంబేపై పలు ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసినదే. ఇకపోతే, పెళ్ళైన అతి తక్కువ కాలంలోనే వీరు పలు కారణాల వలన విడిపోయారు. ఇక బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘లాక్ అప్’ షోలో పూనమ్ తాజాగా పార్టిసిపేట్ చేసింది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రొమోను విడుదల చేయగా అది మంచి రేటింగ్ సంపాదించింది.
Poonam Kaur: పూనం కౌర్ సంచలనం అతడు గెలిస్తే మొత్తం విషయాలు బయట పెడతా..!!
Poonam Pandey: పూనమ్ ఆసక్తికర విషయాలు ఇవే:
పూనమ్ తాజాగా ఓ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు మాట్లాడారు. సామ్ బాంబేతో పూనమ్ రిలేషన్ షిప్లో ఉన్నప్పుడు అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నానని, అందువలన తన మానసిక పరిస్థితి పూర్తిగా దెబ్బతిందని వాపోయింది. దాంతో సామ్‌తో విడిపోతున్నానని ప్రకటించగానే ఈ మీడియా వాళ్ళు పబ్లిసిటీ కోసమే అలా చెప్పానని అనుకున్నారని తెలిపింది. ఈ క్రమంలో తన గురించి ఈ విధంగా మాట్లాడే స్వేచ్ఛ తానే ఇచ్చాననే విషయం అర్థమైందని వివరించింది. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నానని పూనమ్ చెప్పడం కొసమెరుపు.
Poonam Pandey : సింగిల్ గానే ఉన్నానంటున్న పూనమ్ పాండే.. మరి భర్త ఏమైనట్టు!
పూనమ్ తోడు కోరుకుంటోందా?
ఈ సందర్భంగా పూనమ్ మాట్లాడుతూ.. “జీవితంలో స్వశ్చమైన ప్రేమను ఆశించాను. నాకు బ్రేకప్ చేసుకోవడం ఎంతమాత్రమూ ఇష్టం లేదు. ఈ పరిస్థితిలో నన్ను పెళ్లి చేసుకోవడానికి బహుశా ఎవరూ ధైర్యం చూపకపోవచ్చు. గతంలో నాకు వివాహం అంటేనే భయం ఉండేది. కానీ, ఆ సమయంలో అది సరైనది అనుకుని ఏడడుగులు వేశాను. కానీ తరువాత తెలిసింది, నేను మోసపోయానని. జీవితంలో అన్ని మనకి నచ్చినట్టు జరగవు. విడాకులు తీసుకొవాల్సి వచ్చింది. నా మానస్థిక స్థితి బాలేదు. శారీరకంగా కూడా అలసిపోయాను. పలుమార్లు ఆస్పత్రికి వెళ్లాల్సి వచ్చింది.” అంటూ వాపోయింది.