జాతీయ లీగల్‌ సర్వీసె‌స్ అథారిటీ ఛైర్మన్‌గా జస్టిస్ ఎకె సిక్రీ

ఢిల్లీ, జనవరి 01 : జాతీయ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఛైర్మన్‌గా సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎకె సిక్రీని నియమించారు. రాష్ట్రపతి రామనాధ్ కోవింద్ సోమవారం ఈ ఉత్తర్వులు జారీచేశారు.
జస్జీస్ సిక్రీ 2013 ఏప్రిల్ నుంచి సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా ఉన్నారు. గతంలో పంజాబ్, హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గా పనిచేసే ముందు ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నారు.
1954 మార్చి ఏడున జన్మించిన జస్జిస్ సిక్రీ 1977లో న్యాయవాదిగా తన సేవలను ప్రారంభించారు.