న్యూస్

Public WiFi : కోటి పబ్లిక్ వై-ఫై హాట్‌స్పాట్లుకు శ్రీకారం.. 3 కోట్ల మందికి ఉపాధి.!

Share

Public WiFi : కొత్త ఏడాది 2022 చివరి నాటికి భారతదేశ వ్యాప్తంగా సుమారు కోటి పబ్లిక్ వై-ఫై హాట్‌స్పాట్లను ఏర్పాటు చేయనున్నట్టు టెలికాం సెక్రటరీ అయినటువంటి K రాజా రామన్ తాజాగా ప్రకటించారు. దీంతో దాదాపు 3 కోట్ల మంది నిరుద్యోగులకు ఉపాధి చేకూరనుందని తెలిపారు. BIF (బ్రాడ్ బ్యాండ్ ఇండియా ఫోరమ్‌)లో ఆయన మాట్లాడుతూ పై విధంగా స్పందించారు. ఈ సందర్భంగా వై-ఫై ఇక్విప్‌మెంట్ ధరలను తగ్గించడంపై దృష్టి పెట్టాలని వై-ఫై టూల్ తయారీదారులకు రాజారామన్ సూచించారు.

Public WiFi : గ్రామాల్లో, స్థానికంగా ఉండే కోట్లాది మంది ప్రజల కోసం.!

ఇకపోతే, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి పబ్లిక్ వై-ఫై హాట్ స్పాట్ స్కీమ్ అనేది ఎంతో ఉపయోగ పడనుంది. దీనిద్వారా గ్రామాల్లో ఉండే కోట్లాది మంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు దొరకనున్నాయి. వారు ఇక ఉద్యోగాల కోసం పట్టణాల బాట పట్టనవసరం లేదు. లక్షలాది మంది చిన్న వ్యాపారస్తులకు ఈ వై-ఫై హాట్‌స్పాట్లు ఎంతగానో ఉపయోగ పడతాయి. అందువలన ప్రతి హాట్‌స్పాట్‌లో సుమారు ఇద్దరు నుంచి ముగ్గురికి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఉపాధి దొరకనుంది.

పీఎం-వాణి స్కీమ్ ప్రత్యేకత ఇదే..

ఇప్పటి వరకు చూసుకుంటే దేశవ్యాప్తంగా దాదాపు పీఎం-వాణి స్కీమ్ కింద 56 వేలకు పైగా వై-ఫై హాట్‌స్పాట్లను ఏర్పాటు చేయడం జరిగింది. పీఎం-వాణి స్కీమ్‌లో తయారీదారులు పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేయాలని రాజారామన్ తెలిపారు. మెటా(ఫేస్‌బుక్) భాగస్వామ్యంలో BIF కనెక్టివిటీ యాక్సిలేటర్ ప్రొగ్రామ్‌ను తాము లాంచ్ చేస్తున్నట్టు BIF ప్రకటించింది. పబ్లిక్ వై-ఫై హాట్‌స్పాట్లకు సపోర్టుగా నిలిచేందుకు, వినూత్నమైన కనెక్టివిటీ సొల్యుషన్స్‌ను అందించేందుకు వ్యాపారస్తులు, స్టార్టప్‌లు ముందుకు రావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చింది BIF.


Share

Related posts

EAPCET: ఎంసెట్ షెడ్యూల్ ను ప్రకటించిన ఏపి విద్యాశాఖ మంత్రి సురేష్..!!

somaraju sharma

జీవితం ఆనందంగా ఉండాలా?? అయితే ఇలా చేసి చూడండి!!

Yandamuri

మందు బాబులకు షాక్: మద్యం ధరలకు రెక్కలు

somaraju sharma
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar