క్రిస్మస్ వేడుకలకు సర్వం సిద్ధం

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)

అమరావతి, డిసెంబరు 24 : రాష్ట్రంలో ఏసుక్రీస్తు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు క్రైస్తవ సోదరులు సన్నద్ధమయ్యారు. సోమవారం సాయంత్రం నుంచి చర్చిలలో క్రిస్మస్ సందర్భంగా ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పలు చర్చిలను విద్యుత్ దీపాలంకరణలతో అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. క్రిస్మస్ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబునాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ఏసుక్రీస్తు చూపిన మార్గం అనుసరణీయమని ఆయన అన్నారు.