సమంత తొలి సారి పుష్ప సినిమాలో ఐటం సాంగ్ చేస్తుంది. ఈ ఐటం సాంగ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సుకుమార్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
సుక్కు టీంకు సమంత షరతులు
ఈ సాంగ్ చేయడం కోసం సంప్రదించిన సుకుమార్ టీంకు కుందనపు బొమ్మ సమంత అనేక షరతులు పెట్టిందట. ఈ సాంగ్ ను సిటీలో చేయాలని ముందుగా సుకుమార్ టీం ప్లాన్ చేసిందట. కానీ ఈ పాటను సిటీలో కాకుండా సిటీ బయట ప్రత్యేకంగా వేసిన సెట్ లో చేయాలని సమంత కోరిందట. అంటే సిటీ బయట అంటే రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ పాటను చిత్రీకరించాలని సామ్ షరతు పెట్టినట్లుగా తెలుస్తోంది. విడాకుల ఇష్యూ తర్వాత సమంత ఊరికే ఎమోషనల్ అవుతుంది. దీంతో మీడియా దృష్టి తన మీద పడకూడదని సామ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
ఐదు రోజులు లాక్..
ఈ స్పెషల్ సాంగ్ కోసం సమంత ఐదు రోజుల కాల్షీట్లను లాక్ చేసినట్లుగా వినిపిస్తోంది. ఈ పాటను రాక్ స్టార్ డీఎస్పీ కంపోజ్ చేయనున్నాడు. ఇప్పటికే రాక్ స్టార్ ఈ పాట కోసం స్పెషల్ బీట్ ను రెడీ చేసినట్లుగా తెలుస్తోంది. సుకుమార్ దేవీ శ్రీ ప్రసాద్ కాంబినేషన్ లో ఇప్పటికే వచ్చిన అన్ని సినిమాల్లో ఐటం సాంగ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మరి పుష్ప సినిమాలో పాట ఎలా ఉంటుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అల్లు అర్జున్ తో కుందనపు బొమ్మ సమంత ఎటువంటి స్టెప్స్ వేస్తుందో చూడాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా యాక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే.