ముంబాయి, జనవరి 13: భారత జట్టులోకి శుభ్‌మన్ గిల్, విజయ్ శంకర్లు ఎంపికయ్యారు. కాఫీ విత్ కరణ్ అనే టీవి షోలో మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు జట్టు నుండి కేఎల్ రాహుల్, హార్ధిక్ పాండ్యాలు సస్పెన్షన్‌కు గురైయ్యారు. శంకర్ రెండో వన్డేలో ఆడనుండగా, గిల్ న్యూజిలాండ్ టూర్లో ఉంటాడు.
ఈ వివాదంపై మండిపడుతున్న స్పిన్నర్ హర్భజన్ సింగ్ మరోసారి ఉధ్వాసనకు గురైన క్రికెటర్లు తనతో పాటుగా బస్సులో ప్రయాణించడానికి కూడా అంగీకరించనని వ్యాఖ్యానించారు. మహిళలపై ఇటువంటి వ్యాఖ్యలు చేయడం చాలా తప్పని ఆయన అన్నారు.
ఆస్ట్రేలియా-భారత్‌ల మధ్య రెండో వన్డే మంగళవారం అడిలైడ్‌లో జరగనుంది.
previous post
next post