NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

జగిత్యాలలో విషాదం .. సాఫ్ట్ వేర్ ఉద్యోగిని అనుమానాస్పద మృతి .. బాయ్ ప్రెండ్ తో చెల్లి జంప్.. సోదరుడికి ఆడియో మేసేజ్

Advertisements
Share

జగిత్యాల జిల్లాలోని ఓ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్న యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం, ఆమె సోదరి (చెల్లెలు) తన బాయ్ ఫ్రెండ్ తో జంప్ కావడం తీవ్ర సంచలనం అయ్యింది. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని భీమునిదుబ్బ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బీమునిదుబ్బ ప్రాంతంలో బంక శ్రీనివాస రెడ్డి, మాధవి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఇదద్రు కుమార్తెలు దీప్తి (24), చందన, ఒక కుమారుడు సాయి ఉన్నారు. పెద్ద కుమార్తె దీప్తి హైదరాబాద్ లోని ఒక కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగినిగా ఏడాదిన్నర క్రితం చేరారు. ప్రస్తుతం వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నారు. రెండో కుమార్తె చందన బీటెక్ పూర్తి చేసి ఇంటి వద్దనే ఉంటున్నది. కుమారుడు సాయి బెంగళూరులో డిగ్రీ చదువుతున్నాడు.

Advertisements

 

శ్రీనివాసరెడ్డి, మాధురి దంపతులు  హైదరాబాద్ లో బంధువుల గృహ ప్రవేశం ఉండటంతో వెళ్లారు. నిన్న వారు పెద్ద కుమార్తె దీప్తికి కాల్ చేయగా లిప్ట్ చేయలేదు, చందన కు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. దీంతో వారు ఆందోళనతో ఇంటి ముందు ఉన్న వాళ్లకు సమాచారం ఇచ్చారు. ఇంటి ముందు ఉన్న వాళ్లు శ్రీనివాసరెడ్డి ఇంటికి వెళ్లి చూడగా దీప్తి మృతి చెంది ఉండటాన్ని గమనించారు. ఈ విషయాన్ని దీప్తి తల్లిదండ్రులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. డీఎస్పీ రవీందర్ రెడ్డి, కోరుట్ల, మెట్ పల్లి సీఐలు ప్రవీణ్ కుమార్, లక్ష్మీనారాయణ, ఎస్ఐ కిరణ్ కుమార్ సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. దీప్తి మృత దేహం సోఫాలో పడి ఉండగా, వంట గదిలో రెండు మద్యం బాటిళ్లు, కూల్ డ్రింక్స్, తినుబండరాల పాకెట్లు ఉన్నాయి. చందన ఎటు పోయింది అని పరిశీలించగా, తను ఇంట్లో నుండి వెళ్లిపోయినట్లు తెలిసింది.

Advertisements

చందన ఆచూకీ కోసం పోలీసులు బస్టాండ్ లోని సీసీ కెమెరాలను పరిశీలించగా, ఆమె ఓ యువకుడు కలిసి ఉదయం 5.12 గంటల నుండి 5.16 వరకూ బస్టాండ్ లో కాసేపు కూర్చుని ఆ తర్వాత నిజామాబాద్ బస్సులో ఎక్కినట్లు రికార్డు అయ్యింది. దీప్తి తండ్రి శ్రీనివాసరెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంట్లో నుండి పారిపోయిన చందన, ఆమెతో పాటు ఉన్న యువకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇంట్లోకి మద్యం బాటిళ్లు ఎలా వచ్చాయి, ఎవరు తీసుకువచ్చారు..? వీరితో పాటు ఇంకెవరైనా మద్యం సేవించారా..? చందన పారిపోవడానికి కారణాలు ఏమిటి..? అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఇదే క్రమంలో బెంగళూరులో ఉన్న సోదరుడికి చందన ఆడియో మెసేజ్ పెట్టింది. దీప్తి తాను కలిసి మద్యం సేవించామని ఆడియోలో చందన చెప్పింది. ఆ తర్వాత వేరే అబ్బాయితో తాను వెళ్లిపోయినట్లుగా చెప్పింది. అక్క ఎలా చనిపోయిందో తనకు తెలియదనీ, అక్కను  చంపాల్సిన అవసరం తనకు లేదని చెప్పింది. తాను ఏ తప్పు చేయలేదనీ, తనను నమ్మాలని చెప్పింది. ఒక కుమార్తె అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం, మరో కుమార్తె తన స్నేహితుడితో ఏటో వెళ్లిపోవడంతో వారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ కేసులో మిస్టరీని ఛేదించేందుకు పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

ఏపీ వ్యాప్తంగా టీడీపీ నేతల హౌస్ అరెస్ట్ లు


Share
Advertisements

Related posts

నిమ్మగడ్డ మీటింగ్ కి నో చెబుతున్న వైసిపి..!!

sekhar

ఢిల్లీకి జగన్..! మోడీతో ఢీ కొట్టడమే ఇక..!!

somaraju sharma

జయహో బిసికి ‘కౌంటర్‌’గా వైసిపి బిసి గర్జన

Siva Prasad