NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఏపీ వ్యాప్తంగా టీడీపీ నేతల హౌస్ అరెస్ట్ లు

Share

ఇసుక పాలసీ, అక్రమ రవాణాకు వ్యతిరేకంగా టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా మూడో రోజు బుధవారం ఆందోళనలు నిర్వహిస్తొంది. ఈ క్రమంలో ఇవేళ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ ప్రధాన కార్యాలయం ముట్టడికి టీడీపీ అధిష్టానం పిలుపునిచ్చింది. దీంతో అ కార్యాలయం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలో భాగంగా పోలీసులు గొల్లపూడిలో టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమాను హౌస్ అరెస్టు చేశారు. ఆయన ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. నందిగామలో మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యను హౌస్ అరెస్టు చేశారు.

మరో వైపు గుంటూరు జిల్లాలో మాజీ మంత్రులు నక్కా ఆనందబాబు, ఆలపాటి రాజాలను హౌస్ అరెస్టు చేశారు. పలువురు టీడీపీ నేతలకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇసుక సత్యాగ్రహం దృష్ట్యా తిరుపతిలో టీడీపీ నేతలను హౌస్ అరెస్టు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ చార్జ్ లు ఇళ్ల నుండి బయటకు రాకుండా హౌస్ అరెస్టు లు చేశారు. ఈ సందర్భంగా పోలీసులతో టీడీపీ నేతలు వాదనలకు దిగుతున్నారు. ప్రభుత్వ వైఖరిపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

హౌస్ అరెస్టు చేయడంతో దేవినేని ఉమా తన నివాసం వద్దనే నిరసన తెలియజేశారు. ఏపీలో దోచేస్తున్న వైసీపీ ఇసుక మాఫియాపై చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున నినాదాలు చేసారు. ఈ క్రమంలో పోలీసులతో దేవినేని ఉమా, పార్టీ శ్రేణులకు మద్య వాగ్వివాదం జరిగింది. దీంతో పోలీసులు దేవినేని ఉమాను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. మరో పక్క నందిగామ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పలువురు టీడీపీ నేతలతో కలిసి  ఇబ్రహీంపట్నం డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ ప్రధాన కార్యాలయం వద్దకు వెళుతుండగా పోలీసులు అడ్డుకుని అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు.

Fire Accident: షాపింగ్ మాల్ లో అగ్నిప్రమాదం ..భారీ గా ఆస్తినష్టం


Share

Related posts

Bed room: మీ బెడ్ రూమ్ లో నిమ్మకాయ పెడితే ఏమవుతుందో తెలుసుకోండి!!తెలిస్తే తప్పకుండా చేస్తారు.

siddhu

కాంగ్రెస్ పార్టీ ఎందుకిలా మారిపోతుంది…?

Special Bureau

పవన్ కళ్యాణ్ గురించి మాట దాటేసావేం కీరవాణి?

sowmya