Fire Accident: శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలోని ఆర్టీసీ సముదాయం సమీపంలో గల స్నేహ షాపింగ్ మాల్ లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా దుకాణంలో మంటలు చెలరేగినట్లుగా భావిస్తున్నారు. దుకాణ యజమానులు అగ్ని మాపక కేంద్రానికి సమాచారం అందించారు. షాపింగ్ మాల్ లోని మొదటి రెండు అంతస్తులలో మంటలు అంటుకున్నాయి. సమాచారం తెలియడంతో అగ్ని మాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు.

అయిదు ఫైర్ ఇంజన్ లతో మంటలను అదుపు చేశారు. అప్పటికే దుకాణాల్లో ఉన్న బట్టలు, ఫర్నీచర్ ఇతర సామాగ్రి అగ్నికి ఆహుతి అయ్యింది. దాదాపు రూ.2 కోట్లకు పైగా అస్తినష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అగ్నిప్రమాదం కారణంగా స్నేహ షాపింగ్ మాల్ లోని దుకాణాలు తగులబడటంతో పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడకు చేరుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
YSRCP: చంద్రబాబుకు షాక్‌ల మీద షాక్ లు ఇస్తున్న జగన్