NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: చంద్రబాబుకు షాక్‌ల మీద షాక్ లు ఇస్తున్న జగన్

YSRCP: రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలో దక్కించుకోవాలని టీడీపీ పొత్తుల కోసం ఆరాటపడుతోంది. అధికారంలోకి వస్తామని టీడీపీ ధీమా వ్యక్తం చేస్తొంది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తమ అధికారాన్ని నిలుపుతుందని మరో సారి వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ భావిస్తొంది. మరో ఎనిమిది నెలల్లో ఎన్నికలు రానుండటంతో అధికార విపక్షాలు వ్యూహాలు ప్రతి వ్యూహాలతో సిద్దం అవుతున్నాయి. ఆయా పార్టీలు ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, ప్రతి విమర్శల దాడితో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది.

 

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారన్న అభియోగంతో వైసీపీ నుండి సస్పెండ్ అయిన నలుగురు  ఎమ్మెల్యేలు ఆ తర్వాత ఒక్కరొక్కరుగా టీడీపీకి దగ్గర అయ్యారు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీల ఉప ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో వైసీపీ గెలుపొందినా పోటీ జరిగిన స్థానాల్లో టీడీపీ గట్టి పోటీ ఇవ్వడంతో ఆ పార్టీ ధీమా వ్యక్తం చేస్తొంది. ఈ క్రమంలోనే తాము గేట్లు తెరిస్తే వైసీపీ ఖాళీ అవుతుంది అన్నట్లుగా చంద్రబాబు చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. ఇదే తరుణంలో టీడీపీలో అసంతృప్తి నేతలకు వైసీపీ గాలం వేస్తొంది. పలు నియోజకవర్గాల్లోని టీడీపీ నేతలను వైసీపీలో చేర్చుకోవడం ద్వారా చంద్రబాబుకు షాక్ ల మీద షాక్ లు ఇస్తొంది వైసీపీ. ఉమ్మడి విశాఖ, విజయనగరం జిల్లాలకు చెందిన పలువురు టీడీపీ నేతలకు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరి చంద్రబాబుకు షాక్ ఇచ్చారు.

 

విజయనగరం జిల్లా రాజాంకు చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే తలే భద్రయ్య, ఆయన తనయుడు డాక్టర్ తలే రాజేశ్ వైసీపీలో చేరారు. తలే భద్రయ్య గతంలో పాలకొండ నియోజకవర్గం నుండి టీడీపీ తరపున రెండు సార్లు 1985, 1994 ఎన్నికల్లో ఎమ్మెల్యే గా గెలిచారు. అలానే ఏపీపీఎస్సీ సభ్యుడుగానూ ఆరేళ్ల పాటు పని చేశారు. అదే విధంగా అనకాపల్లికి చెందిన టీడీపీ నేత మలసాల భరత్ కుమార్, ఆయన తండ్రి విశాఖ డైరీ డైరెక్టర్ రమణారావు, భరత్ కుమార్ తల్లి మాజీ ఎంపీపీ ధనమ్మ వైసీపీలో చేరారు. వారితో పాటు మాజీ డీసీఎంఎస్ చైర్మన్ గంగుపాం నాగేశ్వరరావు, విశాఖ జిల్లా తెలుగు యువత కార్యదర్శి మలసాల కుమార్ రాజా లు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. వీరికి సీఎం జగన్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. బాబు మాటలు చెబితే జగన్ చేతలతో చూపుతారనీ, రాబోయే రోజుల్లో మరిన్ని చేరికలు ఉంటాయని వైసీపీ నేతలు అంటున్నారు.

గ్యాస్ వినియోగదారులకు కేంద్రం గుడ్ న్యూస్ .. రాఖీ కానుకగా రూ.200 తగ్గింపు

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N