Dhee 13 : ఈటీవీలో ఢీ 13 Dhee 13 షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డ్యాన్స్ కు మరో అర్థం చెబుతోంది ఢీ షో. ఇప్పటి వరకు చాలా సీజన్లను పూర్తి చేసుకున్న షో తాజాగా 13వ సీజన్ ను సక్సెస్ ఫుల్ గా జరుపుకుంటోంది. అయితే.. ఏ డ్యాన్స్ షోలో లేనటువంటి విషయం ఏంటంటే.. ఢీ 13లో సరికొత్త డ్యాన్స్ తో పాటు.. కామెడీని కూడా ఆస్వాదించవచ్చు.

సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, రష్మీ.. లాంటి కమెడియన్లు చేసే సందడి మామూలుగా ఉండదు. వీళ్ల కామెడీకి తోడు.. జడ్జిలు వేసే పంచులు, కంటెస్టెంట్లు చేసే డ్యాన్స్ పర్ ఫార్మెన్స్ తో ఢీ షో ఎక్కడో ఉంది. అందుకే.. బుల్లితెర ప్రేక్షకులు ఢీ షోను బాగా ఆదరిస్తున్నారు.
Dhee 13 : లేటెస్ట్ ప్రోమోలో సుడిగాలి సుధీర్ ను ఆడుకున్నారుగా?
తాజాగా విడుదలైన ఢీ 13 లేటెస్ట్ ప్రోమో చూస్తే పగలబడి నవ్వుతారు. ఎందుకంటే.. సాధారణంగా సుడిగాలి సుధీర్ ను తన తోటి కమెడియన్లు అయిన హైపర్ ఆది, ఇమ్మాన్యుయేల్, రష్మీ లాంటి వాళ్లు ఆటపట్టిస్తుంటారు కానీ.. ఈసారి మాత్రం ఏకంగా ఢీ 13 డైరెక్షన్ డిపార్ట్ మెంట్ వాళ్లే ఆటపట్టించారు. దీంతో స్టేజ్ మీద నవ్వులే నవ్వులు.
సుధీర్ మైక్ పట్టుకొని మాట్లాడితే చాలు.. చెల్లెమ్మకు పెళ్లంట.. అన్నయ్యకు సంబరమంట.. అంటూ బ్యాక్ గ్రౌండ్ పాట వేసి.. సుధీర్ కు చిరాకు తెప్పించారు. చివరకు.. సుధీర్ కు విపరీతంగా కోపం వచ్చింది. సుధీర్ ను మాట్లాడకుండా చేసి.. దాని నుంచి ఫన్ తెప్పించిన విధానం కొత్తగా ఉంది.
ఇంకెందుకు ఆలస్యం.. ఢీ 13 లేటెస్ట్ ప్రోమోను మీరు కూడా చూసేయండి.