SVP: సూపర్ స్టార్ మహేష్ బాబు “గీతా గోవిందం” డైరెక్టర్ పరశురాం దర్శకత్వం లో “సర్కారు వారి పాట” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సంవత్సరన్నరకు పైగా ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ జరుగుతూ ఉంది. “సరిలేరు నీకెవ్వరు” సినిమా తో హట్రిక్ బ్లాక్ మాస్టర్ విజయాలు నమోదు చేసుకున్న మహేష్.. ఈ సినిమాని గత ఏడాది లాక్ డౌన్ టైం లో ప్రకటించడం జరిగింది. వాస్తవానికి “సరిలేరు నీకెవ్వరు” సినిమా తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ సినిమా ఉంటుందని అందరూ భావించారు. కానీ ఆ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ విషయంలో మార్పులు చేర్పులు చేసినా గాని మహేష్ కి నచ్చక పోవడంతో ఆ ప్రాజెక్టు పక్కన పెట్టడం జరిగింది.
ఆ తర్వాత “సర్కారు వారి పాట” సినిమా మొదలు పెట్టిన మహేష్ మొదటి షెడ్యూల్ కంప్లీట్ చేసిన తర్వాత కరోనా సెకండ్ వేవ్ రావటంతో షూటింగ్‌ను ఆపేశాడు. అయితే పరిస్థితులు ఇటీవల అనుకూలించడంతో మళ్లీ షూటింగ్ మొదలు కావడంతో … శరవేగంగా కంప్లీట్ చేస్తూ ఉన్నారు. ఇటీవల జూలై 31 వ తారీకు సినిమాకి సంబంధించి పోస్టర్ రిలీజ్ చేసి సోషల్ మీడియాలో “సర్కారు వారి పాట” సినిమా యూనిట్ అనేక రికార్డులు సృష్టించడం తెలిసిందే. అయితే సోమవారం అనగా ఆగస్టు 9వ తారీకు మహేష్ బర్త్ డే సందర్భంగా సినిమా నుండి మరో సర్ప్రైజ్ వస్తున్నట్లు ముందుగానే సినిమా యూనిట్ ప్రకటించింది.
సరిగ్గా ఆగస్టు 9వ తారీకు ఉదయం 9 గంటల 9 నిమిషాలకు.. మరొక అప్ డేట్ రిలీజ్ అవుతున్నట్లు సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్.. ఎక్కువ లైకులు..రీ ట్వీట్ లు సాధించిన పోస్టర్ గా 24 గంటల్లో సోషల్ మీడియాలో రికార్డు సృష్టించింది. దీంతో ఆగస్టు 9వ తారీకు నాడు రిలీజ్ కాబోయే సర్ప్రైస్ తో.. మహేష్ మళ్లీ ఎటువంటి రికార్డులు సృష్టిస్తాడు అన్నది.. ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. సినిమా యూనిట్ టైమింగ్ ప్రకటించడంతో.. ఇప్పటి నుండే సోషల్ మీడియాలో మహేష్ అభిమానులు.. కొత్త రికార్డులు సృష్టించడానికి పగలగొట్టడం కి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మహేష్ బర్తడే కి సరికొత్త రికార్డు “సర్కారు వారి పాట” సినిమా యూనిట్ రిలీజ్ చేసే దానితో గిఫ్ట్ గా తమ అభిమాన హీరోకి అందివ్వాలని.. మంచి జోష్ మీద ఉన్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ కొత్త షెడ్యూల్ గోవాలో జరుపుకోనున్నట్లు సమాచారం.