భారతదేశం లో ఉన్న సంప్రదాయం ప్రకారం ‘పెళ్లి కి ముందు శృంగారం’అనేమాట వినపడగానే చెంప పగలగొడతారు. కొన్ని కట్టుబాట్లు, సంప్రదాయాల కు విలువ ఇస్తారు కాబట్టి అలాంటి ఆలోచనలు మంచివి కాదని హెచ్చరిస్తారు. నేటి యువతరం కూడా ఇలాంటి వాటికి కాస్త దూరంగా నే ఉంటున్నారు. అయితే, పెరిగిన సాంకేతికత వల్ల విలువలకు కాలం చెల్లిందా ?
కట్టుబాట్లకు, సంప్రదాయాలకు విఘాతం కలిగిందా? అంటే అదేమీ లేదంటోంది మన భారతీయ యువత.కుటుంబం , తల్లిదండ్రులు, నుంచి నేర్చుకున్న విలువలు తమను ఒక పరిధిలో ఉండేలా చేశాయని అంటున్నారు . అవుట్‌లుక్-కార్వీ కలిసి నిర్వహించిన సర్వేలో చాల ఆసక్తికర అంశాలు బయటకు వచ్చాయి. పెళ్లి కి ముందు శృంగారం పై అభిప్రాయం కోరగా.. 66 శాతం మంది అస్సలు వద్దని, 20 శాతం మంది మాత్రం కావాలని, 2 శాతం మంది మాత్రం పెళ్లి కి ముందు శృంగారం సమ్మతమేనని.
అయితే, ఆ వ్యక్తే తమ భాగస్వామి గా ఉండాలని చెబుతున్నారట ఇక, హోమోసెక్సువాలిటీ విషయాని కి వస్తే అది కేవలం వ్యక్తిగత ఎంపిక అని నాలుగింట మూడు వంతుల మంది అభిప్రాయం వ్యక్తం చేసారు. పోర్న్ వెబ్సైట్ల వలన యువత తప్పుదోవ పడుతున్నారని , వాటిని నిషేదించాలని 50 శాతం మంది ఖచ్చితం గా తమ అభిప్రాయాన్ని తెలిపారు ., మతాంతర ,కులాంతర, వివాహాలకు 57 శాతం మంది మద్దతు తెలుపుతుండగా , 33 శాతం మంది మాత్రం వ్యతిరేకిస్తున్నారు.
10 శాతం మంది మాత్రం తటస్థంగా ఉన్నారు. ఇక, స్త్రీలు పాశ్చాత్య దుస్తులు వేసుకోవడానికి 76 శాతం మంది అబ్యంతరం చెప్పలేదు. యువత 23 శాతం మంది డేటింగ్ యాప్‌ను వాడుతుండగా అందులో స్త్రీలు తక్కువగా నే ఉన్నట్టు తెలిసింది. ఇదే కదా మన భారతీయ సంస్కృతీ లో ఉన్న గొప్పదనం … అందుకే పిల్లల కి చిన్నప్పటి నుండి విలువలతో కూడిన ప్రవర్తన నేర్పించడం ప్రతి తల్లి తండ్రి బాధ్యత.