మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ కెరీర్లో 30వ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కలయికలో అంతకు ముందు వచ్చిన అరవింద సమేత వీర రాఘవ సూపర్ డూపర్ హిట్ కావడంతో రాబోతున్న కొత్త సినిమా పై అనేక అంచనాలు పెట్టుకున్నారు నందమూరి అభిమానులు. ఇదిలా ఉంటే రాజమౌళితో చేసిన తర్వాత ఎన్టీఆర్ ఈ సినిమా చేయనున్న క్రమంలో..ఖచ్చితంగా హిట్ అవ్వాలని స్టోరీ విషయంలో త్రివిక్రమ్ ఎక్కడ రాజీ పడటం లేదట.
దీంతో రాజకీయ నేపథ్యంలో ఎన్టీఆర్ ని ఒక ముఖ్యమంత్రి స్థాయి హోదాలో చూపించే దిశగా త్రివిక్రమ్ స్టోరీ రాసినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. మేటర్ లోకి వెళ్తే ఓ రాజకీయ పార్టీ అధినాయకులు తండ్రి కొడుకులను గెంటేసి ప్రజలను తమవైపు తిప్పుకునే విధంగా.. సినిమా స్టోరీ ఉండేటట్లు త్రివిక్రమ్ రాసుకుంటున్నటు ఫిలింనగర్ లో వార్తలు వస్తున్నాయి.
దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో కూడా రావడంతో టిడిపి పార్టీలో ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా పై అంతర్గతంగా చర్చలు జరుగుతున్నట్లు టాక్ నడుస్తోంది. ఇదే క్రమంలో ఇటీవల ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అంటూ ఫ్లెక్సీలు వేలవడం.. తాజాగా త్రివిక్రమ్ సినిమా వార్త ఈ విధంగా ఉండటంతో.. ఒక్కసారిగా త్రివిక్రమ్ ఎన్టీఆర్ సినిమా అటు రాజకీయ రంగం ఇటు ఫిలిం వర్గాల్లో పెద్ద హాట్ టాపిక్ అయినట్లు వార్తలు వినబడుతున్నాయి. ఎన్టీఆర్ కెరీర్లో 30వ సినిమా కావడంతో సినిమాలో ప్రతీ క్యారెక్టర్ విషయంలో కూడా త్రివిక్రమ్ జాగ్రత్త పడుతున్నట్లు పక్కా షెడ్యూల్ తో అతి తక్కువ టైమ్ లోనే సినిమా కంప్లీట్ చేసే విధంగా సినిమా యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.