Telangana: తెలంగాణ రాష్ట్రంలో వీఎఫ్ఎక్స్, యానిమేషన్, గేమింగ్ కంపెనీలకు కొదవలేదు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో డిజిటల్ డొమైన్, గ్రీన్ గోల్డ్ యానిమేషన్, ఈఎఫ్ఎక్స్, ఈఏ, ప్రైమ్ ఫోకస్, ఫైర్‌ఫ్లై, పిక్సెల్ ఎఫ్ఎక్స్ పర్పుల్టాక్, రోటో మేకర్ వంటి ప్రఖ్యాత క్రియేటివ్ టెక్నాలజీ కంపెనీలు ఉన్నాయి. ఈ సంస్థలలోనే చాలా యానిమేషన్ సినిమాలు, గేమ్ క్యారెక్టర్స్ రూపొందించారంటే అతిశయోక్తి కాదు. ఇంటర్నేషనల్ లెవల్లో ఎంతో మందిని అలరించిన ‘లైఫ్ ఆఫ్ పై’ సినిమా భాగ్యనగరంలోని R&H స్టూడియోస్‌లో రూపుదిద్దుకుంది. బ్లాక్‌బస్టర్ హిట్ బాహుబలి, ఈగ సినిమాల వీఎఫ్ఎక్స్ హైదరాబాద్‌కు చెందిన ‘మకుట విజువల్ ఎఫెక్ట్స్’ యానిమేషన్ కంపెనీలో జరిగింది.
Telangana: వాటిని రూపొందించింది కూడా ఇక్కడే
ఛోటా బీమ్, మైటీ రాజు, చోర్ పోలీస్, మైటీ లిటిల్ బీమ్ వంటివన్నీ కూడా తెలంగాణలోని గ్రీన్ గోల్డ్ యానిమేషన్లో గ్రాఫిక్స్ పూర్తి చేసుకుని. అంజి సినిమాలోని గ్రాఫిక్స్‌ను ఫైర్‌ఫ్లై వీడియో గేమ్ కంపెనీలోనే రూపొందించారు. https://fireflyworlds.com/ ఇలాంటి కంపెనీలు ఎన్నో తెలంగాణ క్యాపిటల్‌లోని వెలుస్తూనే ఉన్నాయి. వరల్డ్ క్లాస్ కంపెనీలు ఈ సిటీలో తమ బ్రాంచ్‌లు స్టార్ట్ చేయాలని కూడా ప్రయత్నిస్తున్నాయి. తెలంగాణలో ఈ ఇండస్ట్రీని బాగా డెవలప్ చేసేందుకు ప్రభుత్వం కూడా సహకరిస్తోంది.
ఇండస్ట్రీ అభివృద్ధికి హెల్పింగ్
తెలంగాణలో మీడియా & ఎంటర్టైన్మెంట్ ఎకో సిస్టమ్‌ను ప్రోత్సహించడానికి, అభివృద్ధి చేయడానికి నాన్ ప్రాఫిట్ అసోసియేషన్ తెలంగాణ వీఎఫ్ఎక్స్, యానిమేషన్, గేమింగ్ అసోసియేషన్ (TVAGA) కూడా ఏర్పాటయింది. ఈ అసోసియేషన్‌కు యానిమేషన్, వీఎఫ్ఎక్స్, ఎస్పోర్ట్స్, గేమింగ్.. కామిక్స్ రంగానికి చెందిన ఇండస్ట్రీ లీడర్లు, క్రియేటివ్ మైండ్స్ నాయకత్వం వహిస్తున్నారు. ఇక మూవీస్, కంటెంట్, డిజిటల్ యానిమేషన్, వీఎఫ్ఎక్స్, గేమింగ్ & కామిక్స్ ఇండస్ట్రీ వంటి క్రియేటివ్ ఇండస్ట్రీలకు తెలంగాణను క్రియేటివ్ ఇండస్ట్రీ హబ్‌గా స్థాపించడానికి ప్రభుత్వ భవిష్యత్ విధానం, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా బాగా మద్దతు ఇస్తున్నాయి. ఆ విధంగా తెలంగాణ రాష్ట్రం యానిమేషన్, వీఎఫ్ఎక్స్, గేమింగ్ డెవలప్మెంట్ ఇండస్ట్రీలో ఇండియాకే క్యాపిటల్‌గా మారుతుంది.