బాలీవుడ్ లో తన అందచందాలతో కుర్రకారు మనసును దోచుకుంటున్న భామ ఆలియా భట్.. ఈ సుందరీ తన నటన ద్వారా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. అయితే తన అందాలతో, తన నటనతో ఎన్నో సినిమా చాన్స్ లను అందుకుంటోంది ఈ భామ. కాగా ఈ బ్యూటీకి టాలీవుడ్ ఎంట్రీకి కూడా అవకాశమొచ్చింది. టాలీవుడ్ ప్రముఖ డైరెక్ట్ రాజమౌళి సినిమాలో నటించే చాన్స్ ను ఈ ముద్దుగుమ్మ కొట్టేసింది. రీసెంట్ గా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న త్రిపులార్ మూవీలో ఈ బ్యూటీకి అవకాశం లభించింది.
మగధీర, బాహుబలి చిత్రాల ద్వారా టాప్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు డైరెక్టర్ రాజమౌళి. రాజమౌళి చిత్రాలంటే చాలు ప్రేక్షకులు ఆయన మూవీని భారీ స్థాయిలో ఊహించుకుంటారు. అందుకు తగ్గట్టుగానే రాజమౌళి తన సినిమాలకు తీస్తుంటారు. మరీ ముఖ్యంగా క్రీయేటివిగా ఆలోచింది తన ప్రతిభతో రకరకాల సినిమాలను తెరకెక్కింస్తుంటారు. ఈ డైరెక్టర్ తో ఒక్క సినిమా చాన్స్ వచ్చినా చాలనుకునే వారు చాలా మందే ఉన్నారు.
మరీ ముఖ్యంగా ఈయన పిలుపుకోసం వెయిట్ చేసేవారు అధికం. ఎన్నో గొప్ప గొప్ప సినిమాలు తెరకెక్కించి ఎన్నో అవార్డులను ఆయన సొంతం చేసుకున్నారు. కాగా రీసెంట్ గా రాజమౌళి త్రిపులార్ మూవీని తెరకెక్కించే పనిలో పడ్డారు. ఈ మూవీలో విప్లవ వీరులైన కొమురం భీం, అల్లూరి సీతారామారాజుల జీవితాల స్పూర్తితో ఈ సినిమా రూపొందించబోతోంది. ఇప్పటికే ఈ సినిమా క్లిప్స్ చూసినా జనాలు దీనిపై భారీ ఎక్స్ పెక్టేషన్స్ ను పెట్టుకున్నారు.
అందులోని డైలాగ్స్ ఓ రేంజ్ లో ఉన్నాయంటూ నెటిజన్లు కామెంట్లు కూడా చేసేస్తున్నారు. కాగా ఈ మూవీలో హీరో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించనుండగా, జూనియ్ ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో కనిపించనున్నారు. వీరిరువురి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం భారీ స్థాయిలో తెరకెక్కనున్నట్టు అర్థమవుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది.
ఈ మూవీలో బాలీవుడ్ భామ ఆలియా భట్ కూడా నటించబోతోంది. కాగా ఈ నెలలోనే ఆలియా ఈ సినిమా సెట్స్ లోకి అడుగు పెట్టాల్సి ఉంది. కాని ఆమె ప్రస్తుతం బాలీవుడ్ లో సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో ‘గంగూబాయ్ కథియావాడి’ చిత్రంలో బిజీగా ఉండటం మూలంగా త్రిపులార్ మూవీలో ఎంట్రీకి మరికొంత సమయం పట్టొచ్చని తెలుస్తోంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!