Intrest rates: RBI (రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా) రిజిస్టర్డ్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ నావి ఫిన్‌సర్వ్ రుణ గ్రహీతలకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. హోమ్ లోన్స్‌కు వెంటనే ఆమోదం తెలుపుతున్నామని చెప్పింది. బ్యాంకులు, ఇతర హోమ్ లోన్ ఫైనాన్స్ కంపెనీల కన్నా త్వరగానే రుణాలు అందిస్తామని తాజాగా ఈ కంపెనీ ప్రకటించడం గమనార్హం. ఇక రుణ మంజూరు ప్రాసెస్ అనేది పూర్తిగా డిజిటల్ రూపంలోనే ఉంటుందని తెలిపింది.
హోమ్ లోన్స్‌పై వడ్డీ రేటు సుమారు 6.46 శాతం నుంచి ప్రారంభం అవుతోందని, పెరిగే అవకాశం లేకపోలేదని కంపెనీ చెప్పడం గమనార్హం. బ్యాంకులు, ఇతర ఫైనాన్స్ కంపెనీలతో పోల్చుకుంటే ఇది తక్కువ వడ్డీ అనే చెప్పుకోవాలి. దాదాపు 20 లక్షల నుంచి రూ.5 కోట్ల వరకు హోమ్ లోన్ పొందే వీలుంది. 25 ఏళ్ల వరకు లోన్ టెన్యూర్ ఎంచుకునే ఆప్షన్ ఇక్కడ అందుబాటులో ఉంది. హైదరాబాద్ సహా దేశంలో పలు పట్టణాల్లో నివసించే వారు ఈ లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు. హుబ్లి, దేవంగిరి, గుల్‌బర్గా, బెంగళూరు, మైసూర్, చెన్నై, ఢిల్లీ, గురుగ్రామ్ వంటి ప్రాంతాల్లో హౌసింగ్ లోన్ ప్రాజెక్ట్స్ మంజూరు చేస్తున్నామని, త్వరలోనే ముంబై, పుణేలో కూడా ఈ సేవలు అందుబాటులోకి తీసుకువస్తామని వివరించింది.
లోన్ పొందాలంటే ఇలా చేయాలి:
లోన్ పొందాలంటే ఇలా చేస్తే సరిపోతుంది. నావి యాప్ ద్వారా లోన్ అప్లై ప్రాసెస్ పూర్తి చేయొచ్చని, బ్రాంచ్‌కు వెళ్లాల్సిన పని లేదని చెబుతున్నారు. అదనపు ప్రాసెసింగ్ ఫీజు, అడ్మినిస్ట్రేటివ్ ఫీజు, సెంట్రల్ రిజిస్ట్రీ ఫైలింగ్ చార్జీలు వంటివి ఉండవని గ్రహించాలి. ఇకపోతే ఫ్లిప్‌కార్ట్ మాజీ కోఫౌండ్ సచిన్ బన్సాల్ ఈ నావి టెక్నాలజీస్ అనే కంపెనీని 2018లో స్టార్ట్ చేశారు.
గమనిక: హోమ్ లోన్ కావాలనుకునేవారు ముందుగా నావి యాప్‌ను మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవాలి.
దేవి కనిపించడం లేదని రాధ ఇల్లంతా వెతుకుతుంది.. మాధవ్, వాళ్ళ అమ్మ నాన్నలు దేవి కోసం తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేస్తారు.. ఎవ్వరూ లేరని చెబుతారు.. అప్పుడే…
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇబ్బందుల విషయంలో ఫిలిం ఛాంబర్ షూటింగ్ లు మొత్తం ఆపేయడం తెలిసిందే. దాదాపు వారం రోజులకు పైగానే సినిమా ఇండస్ట్రీలో అన్ని షూటింగులు బంద్…
ఆగస్టు 11 - శ్రావణమాసం - గురువారం మేషం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది. వృత్తి…
రీసెంట్గా `సర్కారు వారి పాట`తో మరో హిట్ ను ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు.. తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా చిత్రం `పుష్ప`. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో మాస్ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం…
హీరోయిన్ టబు అందరికీ సుపరిచితురాలే. సౌత్ మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ ఎప్పటినుండో హీరోయిన్ గా విజయవంతంగా రాణిస్తూ ఉంది. దాదాపు మూడు దశాబ్దాల పాటు…