seasame oil: సహజసిద్దమైన మాయిశ్చరైజర్
నువ్వుల నూనె అనేది ఆరోగ్యానికి మాత్రమే కాదు ఆరోగ్యవంతమైన చర్మానికి,జుట్టు ( Hair ) ను కూడా ఇస్తుంది. నువ్వుల నూనెను వంటలకు మాత్రమే కాదుజుట్టు పోషణకు కూడా వాడవచ్చు. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, తో పాటు ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు, విటమిన్స్, ( Vitamins ) మరియు మినరల్స్ పుష్కలం గా ఉంటాయి. ఈ నువ్వుల నూనె జుట్టుకు సహజసిద్దమైన మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు.
seasame oil: నిర్జీవం గా ఉన్న వెంట్రుకలను
జుట్టు రాలే సమస్య ఉంటే కనుక.. నువ్వుల నూనెను( Seasame oil ) కుదుళ్లకు మస్సాజ్ చేసుకుంటే, కుదుళ్లకు అందవలిసిన పోషక విలువలు బాగా అంది కుదుళ్లు బలంగా ఉండేలా చేస్తాయి. కాస్త నువ్వుల నూనె తీసుకుని వేడిచేసి తలకు పట్టించి మస్సాజ్ చేసుకుని రాత్రంతా అలానే ఉంచి ఉదయాన్నే షాంపూతో తలస్నానం చేయాలి. వారానికి రెండుసార్లు ఈ విధం గా చేయడం వలన జుట్టు మెత్తగా ,ఒత్తుగా ఉంటుంది. నువ్వుల నూనెను మించిన హెయిర్ కండీషనర్ ఇంకొకటి ఉండదు అనడం లో సందేహం లేదు. వెంట్రుకలు చిట్లిపోవడాన్ని ఆపి నిర్జీవం గా ఉన్న వెంట్రుకలను ఆరోగ్యంగా తయారు చేస్తుంది. సగం కప్పు నువ్వుల తీసుకుని నూరి ముద్ద చేసుకుని, రెండు స్పూన్ల యోగర్ట్, తో పాటు స్పూన్ తేనె కూడా కలిపి పేస్ట్‌లా తయారు చేసుకుని వెంట్రులకు పట్టించి , 15 నిమిషాల పాటు ఆరనిచ్చి తర్వాత షాంపూ తో తలస్నానం చేయాలి.
జుట్టు ఆరోగ్యంగా
యాంటీ ఫంగల్ మరియు వాపు తగ్గించే లక్షణాలు నువ్వుల నూనెలో ఉంటాయి. నువ్వుల నూనె రాసుకోవడం వలన మాడు మీదు ఏమైనా కురుపులు ఉంటే తగ్గి జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. 2 స్పూన్ల నువ్వుల నూనె తీసుకుని , స్పూన్ కలబంద గుజ్జు కలిపి ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి బాగా మస్సాజ్ చేసి ఆరిన తర్వాత షాంపూతో తలస్నానం చేసేయాలి.