ట్విట్టర్ డీల్ నుండి తప్పుకున్న ఎలాన్ మస్క్ .. చట్టపరమైన చర్యలకు సిద్దమవుతున్న ట్విట్టర్

Share

ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ట్విట్టర్ యాజమాన్యానికి షాక్ ఇచ్చారు. ట్విట్టర్ కొనుగోలు ఒప్పందం నుండి తప్పుకున్నారు. విలీన ఒప్పందంలోని నిబంధనలను ట్విట్టర్ యాజమాన్యం ఉల్లంఘించినందున 44 బిలియన్ డాలర్ల ఒప్పందం నుండి తప్పుకున్నట్లు ఎలాన్ మస్క్ ప్రకటించారు. ట్విట్టర్ యాజమాన్యం తమ నివేదికలో పేర్కొన్నట్లుగా అయిదు శాతం కంటే తక్కువ గానే స్పామ్ అకౌంట్ లు ఉన్నట్లు గాఆధారాలు చూపించాల్సిందేనని గత కొంత కాలంగా ఎలాన్ మస్క్ డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ట్విట్టర్ యాజమాన్యం స్పష్టత ఇచ్చే వరకూ ఒప్పంద ప్రక్రియ ముందుకు కదలదు అని పలు మార్లు స్పష్టం చేశారు. ఇప్పుడు ఏకంగా ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్లుగా ప్రకటించడంతో అందరూ ఆశ్చర్యానికి గురైయ్యారు.

అయితే మస్క్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ట్విట్టర్ యాజమాన్యం తీవ్రంగా తీసుకుంది. మస్క్ పై చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతోంది. మస్క్ తో అంగీకరించిన దర. నిబంధనల లావాదేవీలను కొనసాగించేందుకు ట్విట్టర్ బోర్డు కట్టుబడి ఉందని పేర్కొన్న ట్విట్టర్ చైర్మన్ బ్రెట్ టేలర్.. విలీన ఒప్పందాన్ని అమలు చేయడానికి చట్టపరమైన చర్యలు కొనసాగించాలని యోచిస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

ఇది కూడా చదవండి: అమరనాథ్ గుహ వద్ద వరద భీభత్సం .. 15 మంది మృతి.. 40 మంది గల్లంతు


Share

Recent Posts

సముద్రతీరానికి కొట్టుకొచ్చిన అనుమానిత బోటు.. అందులో ఏకే 45 ఆయుధాలు.. అసలు మ్యాటర్ ఏమిటంటే..?

మహారాష్ట్ర రాయగఢ్ జిల్లాలోని పర్యాటక ప్రాంతమైన హరిహరేశ్వర్ బీచ్ వద్ద ఏకే 47 ఆయుధాలు కల్గిన పడవ కనిపించడం కలకలాన్ని రేపింది. ముంబైకి 190 కిలీ మీటర్ల…

7 నిమిషాలు ago

కియారా అద్వానిపై దారుణంగా ట్రోలింగ్.. అంత తప్పు ఏం చేసింది..?

నటి కియారా అద్వానీకి అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించింది. తెలుగులో భరత్ అనే నేను సినిమాలో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ…

31 నిమిషాలు ago

ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై స్పందించిన ఏపీ సీఐడీ .. ఫోరెన్సిక్ రిపోర్టుపై డీజీ ఇచ్చిన క్లారిటీ ఇది

గత కొద్ది రోజులుగా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ, వైసీపీ నేతల…

1 గంట ago

దగ్గు తగ్గాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి..!

చాలా మందికి సీజన్ మారితే రకరకాల వ్యాధులు వస్తాయి.ముఖ్యంగా చాలా మంది. సీజన్ మారిన వెంటనే దగ్గు, జలుబుతో ఇబ్బందులు పడుతూ ఉంటారు.కొందరు దగ్గె కదా అని…

2 గంటలు ago

చార్మి 13 సంవత్సరాల వయసు నుంచి తెలుసు అంటున్న పూరి జగన్నాథ్..!!

హీరోయిన్ ఛార్మి అందరికీ సుపరిచితురాలే. 15 సంవత్సరాల వయసులోనే సినిమా ఎంట్రీ ఇచ్చిన సార్ మీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇంక హిందీ భాషల్లో సినిమాలు…

2 గంటలు ago

ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం .. 15 మంది విద్యార్ధులకు గాయాలు

హైదరాబాద్ లోని ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విద్యార్ధులు గాయపడ్డారు. బంజారాహిల్స్ లోని ఆర్కే సినీ మాక్స్ లో గాంధీ సినిమా…

2 గంటలు ago