బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ కు ఉన్న క్రేజ్ కి గారెంటీ హీరో గా బాక్స్ ఆఫీస్ వద్ద నిలిచాడు. బాలీవుడ్ లో తనతోపాటు అగ్రనటులుగా ఉన్నవారు ఏడాదికి ఒక్క సినిమా చేయడానికే కస్టాలు పడుతుంటే అక్షయ్ మాత్రం ఏకంగా ఏడాదిలో మూడు నాలుగు సినిమాలు ఓకే చేస్తూన్నాడు. అయితే పెట్టిన బడ్జెట్ మొత్తం తిరిగి వస్తుండడంతో ఆయన చెప్పిన రేటుకు ప్రొడ్యూసర్స్ ఒప్పుకుంటున్నారట.
అక్షయ్ కుమార్ మూవీస్ సెలక్షన్స్, స్టోరీస్ జడ్జ్ చేసే విధానం, డైరెక్టన్ ఎంచుకునే తీరు ఆయన్ని మిగిలిన హీరోలతో పోలిస్తే సక్సెస్ రేట్ లో ముందు వరసలో నిలబెడుతున్నాయి. ఇక ఆన్ స్క్రీన్ మీద కూడా యాక్టింగ్ తో తనదైన ముద్రవేశారు అక్షయ్ కుమార్. దీనితో ఆయనకు బాలీవుడ్ లో మినిమం గారెంటీ హీరో గా పేరువచ్చింది.
అయితే, తాజా సమాచారం ప్రకారం తన రాబోయే సినిమాలకు తన రెమ్యునరేషన్ ను రూ.135 కోట్లుగా ఫిక్స్ ఆయన చేశాడట. దేశంలో కరోనా వ్యాప్తి వలన నష్టపోయిన సినీ రంగాన్ని దృష్టిలో పెట్టుకుని ఇటీవల ఈయన ఒక సినిమాకు కేవలం రూ.99 కోట్లు మాత్రమే తీసుకున్నాడట. కానీ తన తరువాత చిత్రాల విషయంలో మాత్రం అస్సలు తగ్గేదే లేదంటున్నాడట.
లాక్ డౌన్ లో ఒక సినిమాకు రూ.99 కోట్ల తీసుకుని ఆ తరువాత సైన్ చేసిన సినిమాలకి వరుసగా రూ.108 కోట్లు, రూ.117 కోట్లు తీసుకున్నాడట అక్షయ్. ఇదిలా ఉండగా ఇక 2022లో విడుదల కానున్న చిత్రాల కోసం అక్షయ్ తన రెమ్యూనరేషన్ ని రూ.135 కోట్లు ఫిక్స్ చేశాడట. అక్షయ్ కు ఉన్న అభిమానులు, ఆయనకు ఉన్న. మార్కెట్ ను బట్టి ఇంత పెద్ద మొత్తం ఇవ్వడానికి నిర్మాతలు అంగీకరిస్తున్నారట.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!