watermelon: చాలా మంది టైప్ పాస్ కోసం సోంపు, వక్కపొడి తింటుంటారు. ఇది అందరికీ తెలిసిందే. అయితే ఒక్క సారి మనకు తెలియకుండానే మన ఆరోగ్యానికి ఉపయోగపడే పదార్ధాలను తీసుకుంటుంటాం. మనం తీసుకుంటున్న వాటి వల్ల కలిగే ప్రయోజనాలు కూడా తెలుసుకోవాలి. సోంపు తీసుకోవడం వల్ల పలు రకాల రుగ్మతలు దూరం అవుతాయి. దగ్గు, ఆయాసం, జలుబు తగ్గించేందుకు సొంపు గింజల పొడి 25 గ్రాములు, ఆయుర్వేద ఔషద విక్రయ శాలల్లో దొరికే అతిమధుర చూర్ణం 50 గ్రాములు, పటిక బెల్లం పొడి 75 గ్రాములు కలిపి ఉంచుకుని రోజుకు రెండు పూటల పూటకు అర టీ స్పూన్ పొడిని వంద మిల్లీ లీటర్ల గోరు వెచ్చటి నీటిలో కలిపి సేవించాలి.
250 మిల్లీ మీటర్ల నీటిలో పది గ్రాముల సొంపు గింజలను వేసి సగం నీరు మిగిలేలా సన్నని మంటపై మరగించి గోరు వెచ్చగా అయిన తర్వాత వడబోసి వంద మిల్లీలీటర్లు కాచిన పాలు ఒక టీ స్పూన్ నెయ్యి, ఒక టీ సూపన్ పటిక బెల్లం పొడి కలిపి రాత్రి పడుకునే సమయంలో సేవించడం వల్ల జీర్ణ ప్రక్రియ సాఫీగా సాగడంతో పాటు గ్యాస్ సమస్య తగ్గుతుంది అంటున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు.