Nithin : యూత్ స్టార్ నితిన్ నటించిన లేటెస్ట్ సినిమా మాస్ట్రో. ఈ సినిమా మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు. వరుస ఫ్లాపుల్లో ఉన్న నితిన్ భీష్మ సినిమాతో మంచి హిట్ అందుకొని ఫాంలోకి వచ్చాడు. దాంతో వరుసగా నాలుగు సినిమాలను లైన్ లో పెట్టాడు. అంతేకాదు చక చకా ఆ సినిమాలను పూర్తి చేస్తున్నారు. వాటిలో క్రియేటివ్ డైరెక్టర్ చంద్ర శేఖర్ ఏలేటి దర్శకత్వంలో వచ్చిన చెక్. ఈ సినిమా తీవ్రంగా నిరాశపరచింది. ఈ సినిమా తర్వాత వచ్చిన రంగ్ దే హిట్ ఇస్తుందనుకుంటే, టాక్ మాత్రమే హిట్ అని వచ్చింది గానీ..కమర్షియల్ గా మాత్రం హిట్ అవలేదు.
ఇలా బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు ఆశించిన సక్సెస్ కాకపోవడంతో ఇప్పుడు ఆయన అన్నీ ఆశలు మాస్ట్రో సినిమా మీదే పెట్టుకున్నాడు. ఇటీవలే సినిమా షూటింగ్ కంప్లీట్ అయినా ఈ సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టింది చిత్ర బృందం. ఈ క్రమంలో సాంగ్స్‌ని వదులుతున్నారు. ఇటీవల లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేసిన మాస్ట్రో బృందం తాజాగా దాని వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్ మంచి మెలోడియస్గా సాగుతూ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ సాంగ్‌ను నితిన్ – నభా నటేశ్ల మీద చిత్రీకరించారు.
Nithin : ఇకపైనైనా మాస్ట్రో ప్రమోషన్స్ కి తమన్నాని హైలెట్ చేస్తారో లేదో.
అయితే మాస్ట్రో సినిమా ప్రమోషన్స్ విషయంలో నితిన్.. తమన్నాని పట్టించుకోవడం లేదని టాక్ వినిపిస్తోంది. బాలీవుడ్ అంధాధున్ సినిమాలో టబు పోషించిన పాత్రను ఇక్కడ తమన్నా చేశారు. హిందీలో ఆ పాత్రకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. కానీ ఇక్కడ కాస్త తమన్నా పాత్రని తగ్గించినట్టు తెలుస్తోంది. దానికి తోడు ప్రమోషన్స్ లో తమన్నాని ఎక్కడా హైలెట్ చేయడం లేదు. దాంతో ఆమెని మాస్ట్రో బృందం క్రేజ్ ఉన్న స్టార్ హీరోయిన్ గా వెలుగుతున్న తమన్నాని విషయంలో అశ్రద్దగా ఉన్నారని చెప్పుకుంటున్నారు. చూడాలి మరి ఇకపైనైనా మాస్ట్రో ప్రమోషన్స్ కి తమన్నాని హైలెట్ చేస్తారో లేదో.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!