NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ రాజ‌కీయాలు

Amaravathi : ఏప్రిల్ 17న ఏం జరగబోతోంది??

Amaravathi : అమరావతి Amaravathi భూముల కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై సుప్రీంకోర్టు ఏప్రిల్ 17వ తేదీన ఇవ్వబోయే కీలక ఆదేశాలు ఏపీలో ప్రకంపనలు సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమరావతి భూములను తీసుకోవడంలో భారీగా అవకతవకలు జరిగాయని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ వాదనలను, సిట్ దర్యాప్తు ముందుకు సాగెందుకు అవసరం అయ్యే తగు ఉత్తర్వులు అత్యున్నత న్యాయస్థానం ఏప్రిల్ 17న ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.

what-is-going-on-april-17th Amaravathi
what-is-going-on-april-17th Amaravathi

మాకు సమ్మతమే!

అమరావతి భూముల విషయంలో భారీగా ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని ప్రభుత్వం భావించి ఇప్పటికే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ను నియమించింది. వీరు ప్రాథమిక ఆధారాలు సేకరించారు. ఈ కేసులో కీలకమైన వ్యక్తుల పేర్లను సిట్ పొందుపరచడం తో వివాదం రేగింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వ మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వేసిన పిటిషన్ను విచారణకు స్వీకరించిన రాష్ట్ర హైకోర్టు సిట్ దర్యాప్తు నిలుపుదల చేసేలా స్టే విధించింది. దీనిపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేసిన రాష్ట్ర ప్రభుత్వ వాదనలను సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఆర్ఎస్ రెడ్డి లతో కూడిన బెంచ్ విని, ఈ కేసును సిబిఐ దర్యాప్తు జరపడం సమ్మాతమేనా అని ప్రభుత్వాన్ని కోరడంతో దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఓకే చెప్పింది. దీంతోపాటు సిట్ చేస్తున్న దర్యాప్తుపై హైకోర్టు విధించిన స్టేను ఎత్తివేయాలని సుప్రీంకోర్టు ను ప్రభుత్వం కోరింది.

ఐజీ ర్యాంకు అధికారితో

కేసు సందర్భంగా అత్యున్నత న్యాయస్థానానికి వాదనలు వినిపించిన సీనియర్ అడ్వకేట్ రాజీవ్ ధావన్ ఈ కేసుకు సంబంధించి అక్రమాలు, ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు చేసేందుకు పదిమంది వివిధ శాఖలకు చెందిన సభ్యులతో ప్రభుత్వం ఏర్పాటు చేసిందని న్యాయస్థానానికి తెలిపారు. ఈ సిట్ కు ఐజి ర్యాంకు ఐపీఎస్ అధికారి నేతృత్వం వహిస్తున్నారని, అసలు దీనిలో ఎలాంటి అక్రమాలు జరిగాయో పూర్తిగా తెలుసుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. దీనిపై కోర్టు సానుకూలంగా స్పందించింది. వాదనలు సాహెతకంగా ఉన్నాయని భావించింది.

తీవ్రమైన చర్యలు వద్దు

ఈ కేసు విషయంలో ఇదివరకు హైకోర్టులో వాదనలు వినిపించిన దమ్మాలపాటి శ్రీనివాస్ తో కొన్ని విషయాల్లో తాము ఏకిభవిస్తున్నామని బెంచ్ న్యాయవాదులు జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ రెడ్డి చెప్పారు. గత అడ్వకేట్ జనరల్ గా పని చేసిన దమ్మాలపాటి మీద తీవ్రమైన చర్యలు ఏవి తీసుకోకూడదు అనే అంశాన్ని తాము ఒప్పుకుంటున్నామని, అలాగే దర్యాప్తును కోర్టు మానిటరింగ్ చేయాలన్న వాదనతో ఏకీభవిస్తున్నాం అని చెప్పారు. ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన రాజీవ్ ధావన్ కోర్టు చెబుతున్నట్లు సిబిఐ దర్యాప్తు ప్రారంభించిన వరకూ సీట్లు దర్యాప్తు కొనసాగేలా చూడాలని కోరారు.

తర్వాత చెబుతాం!

ఈ కేసులో తదుపరి వాదనలు తర్వాత వింటామని, కోర్టుకు చాలా కీలకమైన కేసులు ఉండడంతో దీనిని ఏప్రిల్ 7 కు వాయిదా వేశారు. ఆరోజున మరోసారి వాదనలు జరగనున్నాయి. సిట్ దర్యాప్తు కిస్ హైకోర్టు స్టే విధించడంతో దానిపై గతంలోనే అడ్వకేట్ మహవుజ్ నజ్కి గత సెప్టెంబర్ 15వ తేదీన సుప్రీం కోర్టులో కేసు వేశారు. దీనిపై వెంటనే స్పందించిన అత్యున్నత న్యాయస్థానం కేసులో కీలక వ్యక్తులు ఉండడంతో మీడియా నియంత్రణ మీద హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై నవంబర్ 25 న స్టే విధించింది. ఏప్రిల్ 7వ తేదీన వాదనలు ముగిసిన తర్వాత దీనిపై సుప్రీంకోర్టు నిర్ణయం ఏప్రిల్ 17న వెలువడనుంది. ఆ సమయంలో అత్యున్నత న్యాయస్థానం సిబిఐ దర్యాప్తుకు పచ్చజెండా ఊపి, సిట్ కొనసాగించాలని కనుక చెబితే అప్పుడు ఈ అంశం రాష్ట్రంలో పెద్ద విషయం కానుంది. రాజకీయంగానూ కుదుపు వచ్చే అవకాశం ఉంది అని విశ్లేషకులు భావిస్తున్నారు.

 

 

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N