కర్ణాటకలో బీజేపీ రాజకీయం.. కొడుకును దించేసి తండ్రికి కారు

కర్ణాటకలో గత ఏడాది ఏం జరిగిందో తెలిసిన విషయమే. సంకీర్ణ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్న కుమారస్వామిని పీఠం నుంచి దించి యడ్యూరప్ప సీఎం అయ్యారు. అప్పుడు కాంగ్రెస్ తో సహా, జేడీయూ అధినేత దేవెగౌడ, కుమారస్వామి బీజేపీపై మండిపడ్డారు. ప్రస్తుతం ఆ అంశాన్ని అందరూ మర్చిపోయారు. ఇప్పుడు దేవెగౌడను కాకా పట్టేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. ఖరీదైన కారును బహుమతిగా ఇచ్చింది అక్కడి బీజేపీ ప్రభుత్వం. అయితే.. ఇందులో అనేక ట్విస్టులు ఉన్నాయి.

bjp favor to deve gowda in karnataka
bjp favor to deve gowda in karnataka

దేవెగౌడ ఇచ్చారు.. యడ్యూరప్ప ఇచ్చారు..

సాధారణంగా రాజ్యసభ 20 లక్షల్లో ఒక కారు, ఒక డ్రైవర్, సభ్యులకు నలుగురు సిబ్బందిని ప్రభుత్వమే సమకూరుస్తుంది. కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప, ప్రతిపక్ష నాయకుడు సిద్ధరామయ్య, మాజీ ముఖ్యమంత్రులు ఫార్చ్యూన్ కార్లు మాత్రమే వాడుతూంటారు. కానీ.. 80ఏళ్ల వయసులో ఉన్న దేవెగౌడకు ఓ ఖరీదైన కారులో తిరగాలని అనిపించింది. రాజ్యసభ సభ్యులకు ఉండే హక్కుల్లో భాగంగా తనకు 70 లక్షల విలువైన కారు కావాలని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. అయితే.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తిరస్కరించారు. అంత ఖరీదులో ఇవ్వలేమని 25 లక్షల్లో కారు తీసుకోవాలని బదులు రాశారు. దీనికి దేవెగౌడ తిరస్కరించారు. ఈ ఫైల్ సీఎం వద్దకు చేరింది. యడ్యూరప్ప సానుకూలంగా స్పందించారు. దేవెగౌడ కోరిన కారు ఇచ్చారు. ప్రస్తుతం దేవెగౌడ అదే కారు ఉపయోగిస్తున్నారు.

సెంటిమెంట్ నెంబరును కూడా ఇచ్చారు..

కారుతోనే ఆగలేదు. తనకు సెంటిమెంట్ అయిన 9 సంఖ్య కావాలని కూడా కోరారు. ప్రభుత్వం మళ్లీ స్పందించి 3636 అనే నెంబరును కన్ఫర్మ్ చేశారు. KA53G 3636 అనే నెంబర్ దేవెగౌడ కారుకు వచ్చేలా చేశారు. దీంతో దేవెగౌడపై కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్ కాస్త కనికరించింది. కుమారుడు కుమారస్వామిని అధికారం నుంచి దించేసిన బీజేపీ అతని తండ్రి దేవెగౌడను గౌరవించి అడిగినవన్నీ ఇచ్చింది. అయితే.. ఇందులో రాజకీయ ప్రయోజనాలు, అంశాలు, బీజేపీకి అవసరమైనవి లేవని.. లేటు వయసులో ఉన్న దేవెగౌడ కోర్కెలు తీరుస్తూ ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరిస్తోందని అక్కడి రాజకీయ పరిశీలకులు అంటున్నారు.