NewsOrbit
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

బాబు… పాపం బాబుగారండి…!

చంద్రబాబు గురించి ఏం చెప్పినా తక్కువే… ఎంత చెప్పినా ఎక్కువే…! అవును ఆయన గురించి మీడియా ఏం చెప్పినా, ఎంత చెప్పినా ఎక్కువ తక్కువలు ఉంటాయి. పాపం అమరావతిలో లేక ఇన్నాళ్లు మీడియాకు దూరమయ్యారు. అప్పుడప్పుడూ వీడియో సందేశాలు ఇస్తున్నా అవన్నీ తమ అనుకూల మీడియాకు టిఫిన్ లాంటివి, బాబు ప్రెస్ మీట్ పెడితేనే ఆ అనుకూల మీడియాకు ఫుల్ మీల్స్ భోజనం దొరికినట్టు. ఆ నాటి బాబు, మళ్ళీ ఈరోజు దర్శనమిచ్చారు. అనుకూల మీడియాకు ఫుల్ మీల్స్ భోజనం పెట్టారు. అది కూడా మామూలుగా కాదు. బాగా కాలుతున్న మతాబులా వెలుగుతున్న మొహంతో మీడియా ముందుకు వచ్చారు.

పాపం ఎంత వేచి చూసారో…!

ఆ వెలుగుకి కారణం, ఏంటయ్యా అంటే అర్జంటుగా “మోదీ నాకు ఫోన్ చేశారు. నాతో పది నిమిషాలు మాట్లాడారు, లాక్ డౌన్ జోన్లు వారీగా పెట్టాలని నేను ఆయనకు సూచించాను, పరీక్షలు పెంచాలని సూచించాను” అని వెంటనే మీడియాకు చెప్పెయ్యాలని తాహత. పాపం ఎనిమిదిన్నరకి మోదీ ఫోన్ చేసిన తర్వాత పది నిమిషాలు మాట్లాడిన తర్వాత ఎప్పుడు పది అవుతుందా అని లక్ష కళ్ళతో ఎదురు చూసి ఉంటారు. పది దాటినా తర్వాత ఈ మోదీ స్పీచ్ ఎప్పుడు అవుతుందా అని ఎదురు చూసి ఉంటారు. ఆ ఘడియ రాగానే ప్రెస్ ని పిలిచి తన తాహత తీర్చేసుకున్నారు. మోడీ తనకు ఫోన్ చేసారు. నేను రాత్రి చేసాను. కార్యాలయంలో అందుబాటులో లేరు. అందుకే ఈరోజు చేసి పది నిముషాలు మాట్లాడారు” అని చెప్పడానికి బాబు భలే వెలిగిపోయారు.

ఆ రాక్షస మోదీ ఫోన్ కోసమేనా… బాబు…?

సరిగ్గా 13 నెలలు ముందుకు వెళదాం…! ఇదే చంద్రబాబు నోట మీడియా ముందు, జనం ముందు “మోదీ రాక్షసుడు. మోడీ ద్రోహి. మోడీ దేశానికి పట్టిన శని, మోడీకి రాజకీయం నేనే నేర్పించాను. నా తర్వాతే మోడ్ అనేవాడు ముఖ్యమంత్రి అయ్యాడు. ఈ ఎన్నికల్లో మోడీకి విఘాతం తప్పదు. ఆయన అహంకారి, అది మొత్తం దించుతా, మెడలు వంచుతా” అంటూ మాటలు వచ్చేవి. ఊరూరా తిరిగి ప్రచారం చేశారు బాబు. గల్లీ నుండి ఢిల్లీ వరకు ఇదే వరుస. మూడు రోజులు ఏపీలో ప్రచారం చేస్తే ఒకరోజు ఢిల్లీలో జాతీయ నేతలతో మకాం వేసి ప్రెస్ ముందు మాట్లాడేవారు. అలాంటి బాబు ఇప్పుడు మోడీ తనకు ఫోన్ చేసారు, పది నిమిషాలు మాట్లాడారు, నేను సూచనలు ఇచ్చాను, ఆయన నా మాట విన్నారు. అంటూ చెప్పుకున్నారు. ఆ మాటల్లో కూడా తనతో మోడీ స్నేహితుడు అయినట్టు, ఇక టిడిపి, బిజెపి కలిసిపోయినట్టు ఎంతో ఉత్సాహంతో, ఉత్సుకతతో చెప్పుకున్నారు. అదన్నమాట సంగతి. బళ్ళు ఓడలు అవ్వడం, ఓడలు బళ్ళు అవ్వడం అని విన్నాం కానీ మరీ పీహెచ్డీ స్థాయి నుండి ఇంటెర్మీడియట్ స్థాయికి దిగిపోతారని కలగని ఉండరు.

Related posts

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు 

sharma somaraju

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Leave a Comment