NewsOrbit
Featured న్యూస్ రాజ‌కీయాలు

TDP Inside ; విపరీత భయం – ఒక్కటే నమ్మకం..! టీడీపీలో ట్రెండింగ్ టాపిక్ ఇదే..!!

TDP Inside ; తెలుగుదేశం పార్టీ 40 వ పడిలోకి అడుగు పెడుతుంది. ఈ నలభై ఏళ్ళ పార్టీ వయసులో పార్టీ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది. ఎంతో మంది ప్రత్యర్థులను చూసింది. కానీ టీడీపీకి జగన్ లాంటి ప్రత్యర్థి మాత్రం ఎప్పుడూ తగలలేదు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు ప్రతిపక్షం ఇంతలా ఉంటుందా..!? అనేలా ప్రతీ టీడీపీ వాది బలంగా అనుకునేలా జగన్ చర్యలు ఉంటున్నాయి.

2019 ఎన్నికల్లో ఘోర ఓటమి కంటే ఆ పార్టీకి ఇప్పుడు వరుస ఓటములు ఎదురవుతుండడం.. నాయకుల్లో నిలకడ లేకపోవడం.., పార్టీని మోసే భావి నాయకుడు కనిపించక పోవడం పెద్ద సమస్యగా మారింది. ఇప్పుడు ఆ పార్టీలో ట్రెండింగ్ చర్చ ఇదే. మాజీలు, ఎమ్మెల్యేలు, కీలక నేతల మధ్య జోరుగా నడుస్తున్న టాపిక్ ఇదే..!

Must Read ; అసమ్మతి – అసంతృప్తి..! టీడీపీలో కీలక పరిణామాలు..!?

TDP Inside ; Full Fear but One Hope
TDP Inside Full Fear but One Hope

TDP Inside ; విపరీతమైన భయంతో..!!

జగన్ పరిపాలన బాలేదు. అరాచక పాలన చేస్తున్నాడు.., సంక్షేమ పథకాలు అందిస్తున్నప్పటికీ అభివృద్ధి.., ప్రాజెక్టులు, రాజధాని లేని కారణంగా జగన్ కి ఎన్నికల్లో ప్రజలు దెబ్బ వేస్తారు అనుకున్న టీడీపీకి పెద్ద షాక్ తగిలింది. కనీసం ఊహించని పరాజయం ఎదురయింది. తక్కువలో తక్కువ 25 , 30 శాతం అయినా గెలుస్తాం అనుకున్న ఆ పార్టీ ఒక్కటి కూడా గెలవలేకపోయింది. అందుకే ఇప్పుడు పార్టీలో భవిష్యత్తుపై భయంతో ఉంది. జగన్ ని ఎలా ధీ కొట్టాలి..? ఎలా గెలవాలి..? ఇలాగే ఉంటె టీడీపీ ఏమవ్వాలి..? మా పరిస్థితి ఏమవ్వాలి..? అనుకుంటూ ఆందోళన చెందుతున్నారు. “పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా తప్పులు చేయడం ఖాయమే.

అధికారాన్ని వాడుకుని ఎంతో కొంత వెనకేసుకోవడం రాజకీయాల్లో కామన్ విషయం” కానీ ఇప్పుడు అవే పాయింట్ తీసుకుని.. ఆ అక్రమ సంపాదనని సాకుగా చూపి.. అధికార పార్టీ లొంగదీసుకోవడం.. తమ బలహీనతలు అధికార పార్టీ బలాలుగా మారడం టీడీపీ నేతలకు ఏమాత్రం జీర్ణం కానీ విషయం. ఇలా చేస్తూ ఉంటె ద్వితీయ శ్రేణి నేతలు మిగలరని.., ఓటర్లతో కలవగలిగే మండల / గ్రామా స్థాయి నాయకులూ టీడీపీలో ఉండలేరు అనేది టీడీపీలో వెంటాడుతున్న భయం. ఇప్పటికే కొందరు వెళ్లిపోగా.., కొందరు సైలెంట్ అయ్యారు. ఇది ఈ పార్టీని వేధిస్తుంది. ఇదే భయంతో గడుపుతున్నారు. ఆ పార్టీలో కొన్ని రోజులుగా ఇదే చర్చ జరుగుతుంది..!

TDP Inside ; Full Fear but One Hope
TDP Inside Full Fear but One Hope

ఒకే ఒక్క నమ్మకంతో గడిపేస్తున్నారు..!!

ఇక పార్టీ ఏమవ్వాలి..? ఎలా గెలవాలి..? ఏం చేస్తే గెలుస్తాం..? అనే ఆలోచనలు మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే ఒక్క నమ్మకం వారికి కొంచెం ఉపశమనం ఇస్తుంది. “వైసిపి అధికారంలో ఉంది. సో.. టీడీపీకి ఓటేసినా.., టీడీపీ వాళ్ళు గెలిచినా ఏమి చేయలేరు. అందుకే వైసిపికి వేద్దాం. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం వైసిపిపై పగ తీర్చుకుందాం” అంటూ ఓటర్లు అనుకున్నారని.. అందుకే వైసిపికి ఇలా భారీ గెలుపు వచ్చిందని తమలో తాము సమాధానపరుచుకుంటున్నారు. మరోవైపు “జగన్ గాలి ఇన్నాళ్లూ ఉండదు. 2012 లో జరిగిన ఉప ఎన్నికల్లో భారీగా ఓట్లు తెచ్చుకున్న జగన్ .. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు.

2018 ఎన్నికల్లో భారీగా ఓట్లు తెచ్చుకున్న టీఆరెస్ .., 2019 లోక్ సభ ఎన్నికలు, 2020 ఉప ఎన్నికల్లో ఓడిపోయింది. సో.., జనం మూడ్ మారడానికి ఒక్క మూడు నెలలు చాలు. జగన్ అసలు స్వరూపం, పరిపాలనలో లోపాలు తీసుకుని మళ్ళీ టీడీపీకి ఓటేస్తారు.. అనే నమ్మకంతో కొందరు గడిపేస్తున్నారు. తాత్కాలిక ఊరట పొందుతున్నారు. బయటకు ఇలా ఈ నమ్మకాన్ని ప్రదర్శిస్తున్నప్పటికీ.., లోలోపల మాత్రం పైన చెప్పుకున్న భయం/ ఆందోళనతో సతమతమవుతున్నారు..!!

author avatar
Srinivas Manem

Related posts

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N