గీతం అనుమతులకు ఎసరు..!? “న్యూస్ ఆర్బిట్” ముందే చెప్పింది..!!

ఎస్..! ఇది అత్యంత పకడ్బందీగా జరుగుతున్న ఒక మూసివేత..!! గీతం కి ఇక మూడినట్టే. నిన్ననే “న్యూస్ ఆర్బిట్” చెప్పినట్టు గీతం అనుమతులకు ఎసరు పడినట్టే. ఇక తప్పించుకోవడం కష్టమే. అయితే ఇంజనీరింగ్ విభాగం బిల్డింగులుగా భావించి.., జాతీయ సాంకేతిక విద్యామండలి అంటూ “న్యూస్ ఆర్బిట్” రాసింది. కానీ అది మెడికల్ యూనివర్సిటీ భవనాలు కాబట్టి.., వైద్య విద్యా మండలి అని మార్చుకోవాలి. మిగిలింది అంతా సేమ్ తో సేమ్..! ఆ భవనాలు అక్రమం, వెంటనే చర్యలు తీసుకోండి అంటూ ఈరోజు విజయసాయిరెడ్డి జాతీయ మెడికల్ కౌన్సిల్ కి పిర్యాదు చేసారు.

విజయసాయి ఏమని పిర్యాదు చేశారంటే..!?

“గీతం యూనివర్సిటీ భవనాలు చాలా వరకు ప్రభుత్వం భూముల్లో ఉన్నాయి. 40 ఎకరాలు ఆక్రమించుకుని, అక్రమంగా కట్టడాలు నిర్మించుకుని కొనసాగిస్తున్నారు. ఇది జాతీయ వైద్య మండలి నిబంధనలకు విరుద్ధం. ఇటువంటి వాటికి అనుమతులు ఇవ్వకూడదు. యూనివర్సిటీ అనుమతి కోసం దరకాస్తు చేసినప్పుడే భూములకు సంబంధించి అన్ని పత్రాలు తనిఖీ చేయాలి. భవనాలు ప్లాన్స్, భూముల వివరాలు పక్కాగా ఉండాలి. ఇలా ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని యూనివర్సిటీ ఎలా నడుపుతారు..? కానీ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ సభ్యులు నాడు ప్రభుత్వ ఒత్తిళ్లకు తలొగ్గి అనుమతులు ఇచ్చేసారు.

Read Also >> “గీతం”గోవిందం..! స్థలంపై స్టే ఓకే..! కానీ ముందుంది దసరా..!!


* ఇదే కాదు. ఆ యూనివర్సిటీ లో సరైన వసతులు, సిబ్బంది, ప్రయోగశాలలు లేవు అని 2017 – 18 లోనే జాతీయ వైద్యమండలి నివేదిక ఇచింది, ప్రవేశాలు నిలిపివేయాలని అప్పుడే ఆదేశించింది. కానీ నాటి ప్రభుత్వ ఒత్తిళ్లతో మళ్ళీ ఆ నిర్ణయాన్ని రద్దు చేసి, ప్రవేశాలకు అనుమతులు ఇచ్చేసింది. ఇప్పటికీ ఆ యూనివర్సిటీలో ఆ వసతులు కల్పించలేదు, సిబ్బందిని నియమించలేదు. పైగా అక్రమంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇవన్నీ గతంలో సుప్రీమ్ కోర్టు ఇచ్చిన తీర్పులకు విరుద్ధం. అందుకే మీరు కల్పించుకుని.., విచారణ జరిపి.. ఆ యూనివర్సిటీ అనుమతులు రద్దు చేయాల్సిందిగా.., కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశిస్తారని కోరుతున్నాను” అంటూ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఓ పెద్ద లేఖని జాతీయ వైద్య మండలికి పంపించారు.

ఇక జరిగేది లాంఛనమే..!!

ఈ విషయాలన్నీ న్యూస్ ఆర్బిట్ నిన్నే చెప్పింది. యూనివర్సిటీలు ఇలా ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని కట్టకూడదు. అది నిర్ధారణ జరిగితే అనుమతులు రద్దవుతాయి. అనుమతులు ఇచ్చే సమయంలోనే క్షుణ్ణంగా పరిశీలించాలి. కానీ నాటి రాజకీయ పరిస్థితులు, ఒత్తిళ్లు నేపథ్యంలో ఇవన్నీ పెద్ద లెక్కలోకి రావు. కానీ ఇప్పుడు వేరు. అక్కడ ఉన్నదీ జగన్. దేన్నీ తేలిగ్గా వదిలే రకం కాదు. గట్టిగా బిగించేస్తున్నారు. అక్కడ ఆక్రమణలు నిగ్గు తేలితే.., కోర్టులు కూడా ఎంతోకాలం కాపాడలేవు. ఇదే విషయాన్నీ నిన్న న్యూస్ ఆర్బిట్ రాసింది. అంచేత ఇక గీతం అనుమతుల రద్దు ఎంతో దూరంలో లేదు. ఒకప్పుడు మన రాష్ట్రంలో విశాఖలో గీతం అనే యూనివర్సిటీ, కాలేజీ ఉండేది అంటూ కథలుగా చెప్పుకోవాలేమో..!!

Read Also >> “గీతం”గోవిందం..! స్థలంపై స్టే ఓకే..! కానీ ముందుంది దసరా..!!