NewsOrbit

Tag : water issue

న్యూస్

బిగ్ టర్న్ : జగన్ – కే‌సి‌ఆర్ కలిసి ప్రెస్ మీట్ ?? 

siddhu
కరోనా పుణ్యమా అని మొదలైన ఆంధ్ర మరియు తెలంగాణ లో సీఎంల ఆధిపత్యం…. జల వివాదం కారణంగా మరింత ముదిరింది అనే చెప్పాలి. తెలంగాణలోని విపక్షాలు కెసిఆర్ పై విరుచుకు పడేందుకు ఆంధ్రప్రదేశ్ వారి కొత్త జీవోను ఎత్తిచూపడం మరియు కేసీఆర్ కూడా అందుకు తగ్గట్లుగానే ఆంధ్ర ప్రభుత్వం వ్యవహారశైలిపై కృష్ణ బోర్డు కి ఫిర్యాదు చేయడం మనం చూశాం. ఇక జలవనరుల శాఖ అధికారులు అయితే ఒకరిపై ఒకరు తీవ్ర వ్యాఖ్యలు పరోక్షంగా చేసుకునే పరిస్థితి కూడా వచ్చింది. ఇటువంటి సమయంలో కృష్ణ యాజమాన్య బోర్డు మీటింగ్ నిన్న జరగగా అందులో రెండు రాష్ట్రాలకు చెందిన జలవనరుల శాఖ కు సంబంధించిన అధికారులు కీలకంగా పాల్గొని నీటి కేటాయింపుల విషయమై అనేక చర్చలు జరిపారు. ఎప్పుడైతే జగన్ పోతిరెడ్డిపాడు విషయంలో జీవో జారీ చేశారో అప్పటివరకు ప్రశాంతంగా ఉన్నా ఏపీ తెలంగాణ ప్రభుత్వాల మధ్య టెన్షన్ వాతావరణం నెలకొంది సంగతి తెలిసిందే. అయితే ఈ విషయమై త్వరలోనే జగన్ మరియు కేసీఆర్ చర్చించి ఒక నిర్ణయానికి వస్తారని తెలుస్తోంది. తాజాగా జగన్ కూడా నిన్న జరిగిన మీటింగ్ అయిపోయిన తర్వాత జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు ప్రస్తుతానికి పోతిరెడ్డిపాడు రిజర్వాయర్ సామర్థ్యం పెంపు పనులను తాత్కాలికంగా నిలిపి వేయాలని ఆదేశాలు జారీ చేశారని వైసిపి వర్గాల్లో టాక్ నడుస్తోంది. అయితే ఈ విషయంలో జగన్ కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు అనే చెప్పాలి. ముందునుండి రాయలసీమకు నీళ్లు ఇవ్వాలి అనేదే జగన్ టార్గెట్. అయితే జగన్ తీసుకున్న నిర్ణయంతో తప్పు ఏమీ లేకపోయినా తెలంగాణ ప్రభుత్వం పూర్తిస్థాయిలో అర్థం చేసుకోకపోవడం…. అక్కడి ప్రతిపక్ష పార్టీలు కావాలని విషయాన్ని పెద్దది చేసి తెలంగాణ ప్రజలకు ఏదో అన్యాయం జరుగుతుంది అన్నట్లు క్రియేట్ చేయడంతో ఈ గొడవ అంతా వచ్చింది. ఇకపోతే రానున్న రోజుల్లో సీఎం కేసీఆర్ తో కూర్చుని దీని గురించి మాట్లాడుకుని ఇద్దరూ కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. అదే కనుక జరిగితే రెండు రాష్ట్ర రాజకీయాల్లో ఈ మీటింగ్ చాలా పెద్ద టర్న్ అవుతుంది....