తెలంగాణ ధాన్యం రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ .. తెలంగాణ సర్కార్ పై విమర్శలు

Share

తెలంగాణ ధాన్యం రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణలో ధాన్యం సేకరణకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని బుధవారం కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, కిషణ్ రెడ్డిలు తెలిపారు. ఇదే సమయంలో కేంద్ర మంత్రులు తెలంగాణలోని కేసిఆర్ సర్కార్ పై తీవ్ర విమర్శలు చేశారు. ధాన్యం సేకరణకు ఎఫ్‌సీఐ క్లియరెన్స్ ఇస్తుందని చెప్పారు పీయుష్ కుమార్. పేదలకు సాయం చేసేందుకు కేంద్రం చిత్తశుద్దితో పని చేస్తోందని తెలిపారు. పేదలను తెలంగాణ ప్రభుత్వం పట్టించుకునే స్థితిలో లేదని అన్నారు. పేదలకు ఇంత అన్యాయం చేస్తున్న రాష్ట్రం దేశంలో మరొకటి లేదని పీయూష్ గోయల్ విమర్శించారు.

 

దేశ వ్యాప్తంగా 80 కోట్ల మందికి అయిదు కేజీల చొప్పున అదనపు ధాన్యం ఇస్తున్నామని మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. రాజకీయ అజెండాతో కేంద్రంపై టీఆర్ఎస్ ప్రభుత్వం నిందలు వేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసిఆర్ ప్రతిదీ రాజకీయం చేయకుండా పేదల గురించి ఆలోచించాలని హితవు పలికారు. ప్రధాన మంత్రి, కేంద్ర మంత్రులపై తెలంగాణ సీఎం, మంత్రులు చాల అసభ్యంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. సీఎం కేసిఆర్ అన్ పార్లమెంటరీ వ్యాఖ్యలు చేస్తున్నారని పీయూష్ గోయల్ అన్నారు.

 

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ రైతులు, రైస్ మిల్లర్ల పరిస్థితి దృష్ట్యా ధాన్యం కొనుగోలునకు కేంద్రం నిర్ణయించినట్లు తెలిపారు. ధాన్యం కొనుగోలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని ఆయన స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలు అంశంలో కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు ఆరోపణలు చేస్తోందని ఆరోపించారు. కేంద్రం ధాన్యం సేకరిస్తున్నా ఉద్దేశపూర్వకంగా టీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. కేంద్రం రూ.3.5 లక్షల కోట్ల ఖర్చుతో ప్రతి వ్యక్తికి అయిదు కిలోల బియ్యం ఇస్తొందని ఆయన తెలిపారు.


Share

Recent Posts

సముద్రతీరానికి కొట్టుకొచ్చిన అనుమానిత బోటు.. అందులో ఏకే 45 ఆయుధాలు.. అసలు మ్యాటర్ ఏమిటంటే..?

మహారాష్ట్ర రాయగఢ్ జిల్లాలోని పర్యాటక ప్రాంతమైన హరిహరేశ్వర్ బీచ్ వద్ద ఏకే 47 ఆయుధాలు కల్గిన పడవ కనిపించడం కలకలాన్ని రేపింది. ముంబైకి 190 కిలీ మీటర్ల…

17 నిమిషాలు ago

కియారా అద్వానిపై దారుణంగా ట్రోలింగ్.. అంత తప్పు ఏం చేసింది..?

నటి కియారా అద్వానీకి అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించింది. తెలుగులో భరత్ అనే నేను సినిమాలో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ…

42 నిమిషాలు ago

ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై స్పందించిన ఏపీ సీఐడీ .. ఫోరెన్సిక్ రిపోర్టుపై డీజీ ఇచ్చిన క్లారిటీ ఇది

గత కొద్ది రోజులుగా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ, వైసీపీ నేతల…

2 గంటలు ago

దగ్గు తగ్గాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి..!

చాలా మందికి సీజన్ మారితే రకరకాల వ్యాధులు వస్తాయి.ముఖ్యంగా చాలా మంది. సీజన్ మారిన వెంటనే దగ్గు, జలుబుతో ఇబ్బందులు పడుతూ ఉంటారు.కొందరు దగ్గె కదా అని…

2 గంటలు ago

చార్మి 13 సంవత్సరాల వయసు నుంచి తెలుసు అంటున్న పూరి జగన్నాథ్..!!

హీరోయిన్ ఛార్మి అందరికీ సుపరిచితురాలే. 15 సంవత్సరాల వయసులోనే సినిమా ఎంట్రీ ఇచ్చిన సార్ మీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇంక హిందీ భాషల్లో సినిమాలు…

2 గంటలు ago

ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం .. 15 మంది విద్యార్ధులకు గాయాలు

హైదరాబాద్ లోని ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విద్యార్ధులు గాయపడ్డారు. బంజారాహిల్స్ లోని ఆర్కే సినీ మాక్స్ లో గాంధీ సినిమా…

2 గంటలు ago