తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Jana Reddy : నాగార్జున సాగర్ ఉప ఎన్నికల పై సొంత పార్టీకి షాక్ ఇచ్చే రీతిలో కామెంట్లు చేసినా జానారెడ్డి..!!

Share

Jana Reddy : నాగార్జున సాగర్ ఉప ఎన్నికల పై సొంత పార్టీకి షాక్ ఇచ్చే రీతిలో కామెంట్లు చేసినా జానారెడ్డి..!!

 

Jana Reddy: Jana Reddy made shocking comments on his own party on Nagarjuna by-election .. !!
Jana Reddy: Jana Reddy made shocking comments on his own party on Nagarjuna by-election .. !!

Jana Reddy : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టిఆర్ఎస్ పార్టీ వరుస విజయాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. కానీ అనూహ్యంగా ఇటీవల దుబ్బాక అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో విజయానికి దూరమవుతూ, దాదాపు ప్రజల ఆదరణ కోల్పోయే రీతిలో టిఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఉన్నట్లు ఫలితాలు బట్టి అర్థమవుతోంది. ఇలాంటి తరుణంలో నాగార్జునసాగర్ ఉప ఎన్నిక ద్వారా మళ్లీ సత్తా చాటాలని టిఆర్ఎస్ పార్టీ అనేక వ్యూహాలతో రెడీగా ఉంది. పరిస్థితి ఇలా ఉండగా నాగార్జునసాగర్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలోకి దిగుతున్న మాజీ ఎమ్మెల్యే జానారెడ్డి… జరగబోయే ఉప ఎన్నిక గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.

 

ఒకానొక సమయంలో ఈ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా వుండేది. కానీ గత ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ తరఫున నోముల నరసింహయ్య గెలవడంతో ఆ తర్వాత ఆయన అకాల మరణంతో ఉప ఎన్నికలు రావడం జరిగాయి. ఇలాంటి తరుణంలో ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున జానారెడ్డి బరిలోకి దిగుతుంటే, మరోవైపు బిజెపి పార్టీ జానా రెడ్డి కొడుకు రఘువీర్ రెడ్డిని పార్టీ తరఫున టికెట్ ఇచ్చి బరిలోకి దించే వ్యూహాలు వేస్తూ ఉంది. ఇలాంటి తరుణంలో జానారెడ్డి ఊహించని విధంగా కామెంట్లు చేశారు. మేటర్ లోకి వెళ్తే నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో తోటి అనుచరులు అంతా కొడుకు రఘువీర్ రెడ్డి కి సపోర్ట్ చేయాలని అంటున్నారని, దీంతో తన కొడుకు పోటీకి దిగితే తాను… ఉప ఎన్నిక బారి నుండి వైదొలుగుతానని… హస్తం పార్టీకి షాక్ ఇచ్చే రీతిలో జానారెడ్డి కామెంట్లు చేయడం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయింది.


Share

Related posts

పేదరికంపై గెలుపే ఎన్‌టిఆర్‌కు నివాళి : బాబు

somaraju sharma

MAA Elections: మా ఎన్నికలపై మోహన్ బాబు హాట్ కామెంట్స్..

somaraju sharma

Son of India: “మంచు” ఓవర్ యాక్షన్ కి ప్రేక్షకులు గిఫ్ట్..! మోహన్ బాబు ఘనత ఇదీ..!!

Muraliak