కేసిఆర్ సర్కార్ నేడు 11వ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నది. ఈ ఏడాది శాసనసభ ఎన్నికలకు వెళ్లనున్న వేళ కీలకమైన చివరి బడ్జెట్ ఈ రోజు ప్రవేశపెడుతోంది. ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో..శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మండలిలో బడ్జెట్ ప్రవేశపెడతారు. ఉదయం 10.30 గంటలకు ఉభయ సభల సమావేశాల ప్రారంభంతో నేరుగా బడ్జెట్ ప్రసంగం ఉంటుంది. బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు శాసనసభకు వచ్చే ముందు మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ ఉంటుందన్నారు మంత్రి హరీష్ రావు. సంక్షేమం, అభివృద్ధికి బడ్జెట్ లో ప్రాధాన్యత ఉంటుందని మంత్రి హరీష్ రావు చెప్పారు. కేంద్ర సహకారం లేకపోయినా అభివృద్ధి సాధిస్తున్నామని అన్నారు. తెలంగాణ బడ్జెట్ దేశానికే మోడల్ గా నిలుస్తుందని ఆకాంక్షించారు. అనంతరం మంత్రి హరీష్ రావు బడ్జెట్ కాపీలతో జూబ్లీహిల్స్ లోని వెంకటేశ్వరస్వామి వారి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదుపరి హరీష్ రావు అసెంబ్లీకి చేరుకున్నారు.
తెలంగాణలో ఈ ఏడాదే అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో సంక్షేమం, అభివృద్ధిని యథాతథంగా కొనసాగిస్తూ కొన్ని కొత్త పథకాలను జోడిస్తూ ప్రజారంజక బడ్జెట్ పెట్టే అవకాశం ఉంది. సంక్షేమమే ప్రధాన ఎజెండాగా ఈ బడ్జెట్ పెట్టే అవకాశాలు ఉన్నాయి. దాదాపు మూడు లక్షల కోట్ల వరకూ బడ్జెట్ ఉండే అవకాశం ఉంది.
గుంటూరు తరహా దుర్ఘటనే తమిళనాడులో.. నలుగురు మహిళలు దుర్మరణం.. నిర్వహకులు జర జాగ్రత్త