NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Motkupalli Narasimhulu: “కారు”ఎక్కేందుకేనా కేసీఆర్ సారుకు ఆ బిజెపి నేత  భజన?

Motkupalli Narasimhulu: ఓ పక్క తెలంగాణలో అధికార టీఆర్ఎస్, బీజేపీ ఉప్పు, నిప్పు మాదిరిగా ఉన్నాయి. రాబోయే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ముందుకు సాగాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపి బండి సంజయ్ కలలు కంటున్నారు. దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలో ఘన విజయం సాధించడం, ఆ తరువాత గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో మునుపెన్నడూ లేని విధంగా స్థానాలు కైవశం చేసుకోవడంతో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీయేనని ఢంకాభజాయించి చెబుతున్నారు. నిత్యం టీఆర్ఎస్ పార్టీపై, సీఎం కేసిఆర్ పై ఆరోపణలు, విమర్శలు చేస్తూ రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తూనే ఉన్నారు. ఈ తరుణంలో పార్టీ స్టాండ్ కు భిన్నంగా ఓ బీజేపీ నాయకుడు సీఎం కేసిఆర్ ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి హజరు కావడంతో పాటు కేసిఆర్ ను పొగడ్తలతో ముంచెత్తడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది.

Motkupalli Narasimhulu appreciates kcr
Motkupalli Narasimhulu appreciates kcr

దళిత్ ఎంపవర్‌మెంట్ పథకం విధివిధానాలపై చర్చించేందుకు సీఎం కేసిఆర్ అధ్యక్షతన ఆదివారం ప్రగతిభవన్ లో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు. అయితే ఈ సమావేశాన్ని బహిష్కరిస్తున్న బీజేపీ ప్రకటించింది. అయినప్పటికీ ఇతర రాజకీయ పార్టీ నేతలతో పాటు బీజేపీ నేత, మాజీ మంత్రి మోతుకుపల్లి నర్శింహులు సమావేశానికి హజరైయ్యారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే పార్టీ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించిన తరువాత ఆ సమావేశంలో మోతుకుపల్లి పాల్గొనడం ఒక ఎత్తు అయితే సీఎం కేసిఆర్ ను పొగడ్తలతో ముంచెత్తడం మరో ఎత్తు. ఈ పరిణామంతో బీజేపీ నేతలు విస్మయానికి గురైయ్యారు. ఎస్సీల అభివృద్ధి గురించి ఇంతగా తపించే సీఎం కేసిఆర్ కు భగవంతుడి ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుందని అనడంతో పాటు మరియమ్మ లాకప్ డెత్ విషయంలో సీఎం తీసుకున్న రక్షణ చర్యలతో దళితుల్లో విశ్వాసం పెరిగిందని అన్నారు. ఈ విషయంలో కేసిఆర్ చూపిన శ్రద్ధకు అభినందనలు తెలియజేశారు.

Motkupalli Narasimhulu appreciates kcr
Motkupalli Narasimhulu appreciates kcr

పార్టీ నిర్ణయానికి భిన్నంగా సమావేశంలో పాల్గొనడమే కాకుండా సీఎం కేసిఆర్ ను ప్రశంసలతో ముంచెత్తడం బీజేపీ నేతలకు ఆగ్రహం తెప్పించిందని అంటున్నారు. అధికార పార్టీకి దగ్గర అయ్యేందుకే మొతుకుపల్లి ఆ అవకాశాన్ని వాడుకున్నారా అనే మాట కూడా వినబడుతోంది. మొతుకుపల్లి బీజేపీలో చేరకముందు సుదీర్ఘకాలం టీడీపీలో పని చేశారు. పూర్వశ్రమంలో కేసిఆర్, మొతుకుపల్లి టీడీపీ ద్వారానే రాజకీయంగా ఎదిగిన విషయం అందరికీ తెలిసిందే. మొతుకుపల్లి భవిష్యత్తు ప్రణాళికలో భాగంగా ఈ సమావేశానికి హజరయ్యారా లేక సాధారణంగానే హజరయ్యారా అనేది మరి కొద్ది రోజుల్లో తేలనున్నది.

కాగా సమావేశంలో దళితుల సామాజిక, ఆర్థిక బాధలు తొలగిపోవాలంటే ఏమి చేయాలో దశల వారీగా కార్యచరణ అమలు చేస్తామనీ, దళితులు ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్లడానికి ప్రభుత్వం ఏమి చేయాలో అఖిలపక్ష నేతలు సూచనలు, సలహాలు అందించాలని సీఎం కేసిఆర్ కోరారు. ఈ సందర్భంగా దళిత సాధికారత పథకంపై సమిష్టిగా నిర్ణయం తీసుకున్నారు. రూ.1200 కోట్లతో ఈ పథకం ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. ఒక్కో యూనిట్ కి రూ.10లక్షల ఆర్థిక సాయం అందిస్తామనీ, నేరుగా లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో ఈ సొమ్మును జమ చేయాలని నిర్ణయించారు. మొదటి దశలో ప్రతి నియోజకవర్గం నుండి వంద కుటుంబాల చొప్పున పదివేల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N