21.7 C
Hyderabad
February 5, 2023
NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

తెలంగాణ కాంగ్రెస్ కు హైకోర్టులో బిగ్ రిలీఫ్

Share

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి హైకోర్టులు రిలీఫ్ లభించింది. రీసెంట్ గా తెలంగాణ పోలీసులు కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు కార్యాలయం (కాంగ్రెస్ వార్ రూమ్) దాడి చేసి సోదాలు జరిపిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో పలువురిపై అసభ్య పోస్టులు పెడుతున్నారన్న అభియోగంపై పోలీసులు కార్యాలయంలో సోదాలు జరిపి సీపీయూలు, ల్యాప్ టాప్ లు స్వాధీనం చేసుకున్నారు.

Telangana High Court

 

ఈ కేసులో ఇషాక్, శశాంక్, ప్రతాప్ లకు పోలీసులు 41 సీఆర్పీసీ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ .. సదరు నోటీసులను కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టులో విచారణ సందర్భంలో పిటిషనర్ల వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం.. పోలీసులు జారీ చేసిన నోటీసులపై స్టే విధించింది. కేసు విచారణ పైనా కోర్టు స్టే ఇచ్చింది. తదుపరి విచారణను హైకోర్టు రేపటికి (శుక్రవారం) వాయిదా వేసింది.

కాంగ్రెస్ వార్ రూమ్ పై పోలీసులు దాడి చేసి సోదాలు జరపడాన్ని ఆ పార్టీ నేతలు తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించిన సంగతి తెలిసిందే.

హస్తినకు చేరుకున్న తెలంగాణ గవర్నర్ తమిళి సై.. కొద్ది సేపటిలో అమిత్ షాతో భేటీ..


Share

Related posts

YCP MLC: వైసీపీ ఎమ్మెల్సీ ఉదయ్ బాబు కారు డ్రైవర్ అనుమానాస్పద మృతి ..మేటర్ ఏమిటంటే..?

somaraju sharma

Aadhaar UIDAI Services: ఆధార్ కార్డుతో లింకైన మొబైల్ నెంబర్ ను ఎలా తెలుసుకోవాలంటే..

bharani jella

పూరి జగన్నాధ్ – బాలయ్య కాంబోలో వచ్చేది చారిత్రాత్మకమా .. పూరి రాసిన 7 కథల్లో ” గోన గన్నారెడ్డి ” ..?

GRK