NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

YS Viveka Case: ‘డబ్బు సంచులు’ అంటూ వ్యాఖ్యలపై న్యాయమూర్తి ఆగ్రహం .. ఏబీఎన్, మహా టీవీ డిబేట్ ల వీడియోలు కోర్టు ఇవ్వాలంటూ తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు

telangana-high-court-serious-on-tv-channels-debate-on-ys-viveka-case

YS Viveka Case: మాజీ మంత్రి వైఎస్ అవినాష్ రెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డికి బిగ్ రిలీఫ్ లభించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే బెయిల్ పిటిషన్ పై తీర్పు సందర్భంగా న్యాయమూర్తి మరో కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ వైఎస్ అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ విచారణ ముగిసిన తర్వాత మద్యంతర ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

YS Avinash Reddy

ఈ మధ్యంతర ఉత్తర్వులపై టీవీ చర్చల్లో పాల్గొన్న సస్పెండైన మెజిస్ట్రేట్ ఆ ఉత్తర్వులను తప్పుబడుతూ, న్యాయమూర్తికి దురుద్దేశాలు ఆపాదిస్తూ వ్యాఖ్యలు చేశారు. హైకోర్టు న్యాయమూర్తికి డబ్బు సంచులు వెళ్లాయంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను కోర్టు తీవ్రంగా పరిగణించింది. ఏబీఎన్, మహా టీవీ ఛానళ్లలో ఈ నెల 26వ తేదీ జరిగిన చర్చల వీడియోలను ఇవ్వాలని రిజిస్ట్రార్ కు న్యాయమూర్తి ఆదేశించారు. ఆ వీడియోలను డౌన్ లోడ్ చేసి తెలంగాణ హైకోర్టు సీజేకి అందించాలని ఆదేశించారు. టీవీ చర్చల్లో చేసిన కామెంట్స్ చూసి తాను తీవ్రంగా కలత చెందినట్లుగా ఈ సందర్భంగా న్యాయమూర్తి తెలిపారు.

dd

మీడియా అంటే తమకు పూర్తి గౌరవం ఉంది, మీడియా స్వేచ్చకు తాము అడ్డంకి కాదు కానీ కొన్ని మీడియా సంస్థలు వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డాయని న్యాయమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. ఒక స్థాయిలో విచారణ నుండి తప్పుకోవాలని కూడా భావించాననీ, కానీ సుప్రీం కోర్టు ఆదేశాలు, పవిత్రమైన న్యాయవ్యవస్థపై ఉన్న గౌరవంతో విచారణను కొనసాగించినట్లు తెలిపారు. న్యాయమూర్తిగా ప్రమాణం చేసిన సందర్భాన్ని గుర్తు తెచ్చుకున్నట్లు చెప్పారు. టీవీ ఛానళ్లలో జరిగిన చర్చ కోర్టు దిక్కరణ కిందకు వస్తుందనీ, దీనిపై చర్యలు తీసుకోవాలా వద్దా అనేది హైకోర్టు నిర్ణయిస్తుందని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఇది ఒక రకంగా ఏకపక్షంగా డిబేట్ లు నిర్వహించే టీవీ ఛానళ్లకు, ఇష్టానురీతిలో మాట్లాడే వారికి షాకింగ్ నిర్ణయమే అని చెప్పవచ్చు.

Big Breaking: తెలంగాణ హైకోర్టులో అవినాష్ రెడ్డికి బిగ్ రిలీఫ్ .. షరతులతో కూడిన బెయిల్ మంజూరు

author avatar
sharma somaraju Content Editor

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N