NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

TRS MP: ఆ అధికార పార్టీ ఎంపీకి 6 నెలల జైలు శిక్ష ..! చివరలో ట్విస్ట్..అది ఏమిటంటే..?

TRS MP: ప్రజా ప్రతినిధులపై వివిధ కోర్టుల్లో విచారణలో ఉన్న కేసులను సత్వరమే ముగించాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రజా ప్రతినిధుల కోర్టులు కేసులను వేగంగా విచారించి పరిష్కరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్ అధికార టీఆర్ఎస్ ఎంపి మాలోత్ కవితపై గతంలో నమోదైన కేసులో ప్రజా ప్రతినిధుల కోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఎంపి కవితకు ఆరు నెలల జైలు శిక్ష, రూ.10వేల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే సదరు ఎంపి రూ.10వేలు జరిమానా చెల్లించి ఆపై బెయిల్ కు దరఖాస్తు చేసుకోగా కోర్టు వెంటనే బెయిల్ మంజూరు చేసింది.

TRS MP Sentenced for 6 months jail and gets bail
TRS MP Sentenced for 6 months jail and gets bail

విషయం ఏమిటంటే.. ఎన్నికలలో రాజకీయ పార్టీల నేతలు ఓటర్లను ఆకట్టుకునేందుకు డబ్బులు పంపిణీ చేయడం సర్వసాధారణం అయిపోయింది. ఎన్నికల సమయంలో వివిధ ప్రాంతాల్లో పంపిణీ చేస్తున్న పెద్ద ఎత్తున నగదును సీజ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే 2019 పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబాబాద్ నుండి టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో దిగిన మలోత్ కవిత ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేలా వ్యవహరించారన్న ఫిర్యాదుతో బూర్గంపహాడ్ పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. ఈ కేసును ప్రజా ప్రతినిధుల కోర్టుకు బదిలీ చేయగా విచారణ జరిపిన కోర్టు..నిందితురాలిపై నేరం నిరూపణ అయిన కారణంగా జైలు శిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది.

కాగా కోర్టు తీర్పు వచ్చిన వెంటనే ఎంపి కవిత రూ.10వేలు జరిమానా చెల్లించారు. ఆ వెంటనే తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు వెంటనే ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. ప్రజా ప్రతినిధుల కోర్టులో ఎంపి కవిత దోషిగా నిర్ధారణ అయినా ఆమెకు తక్షణం బెయిల్ లభించడంతో జైలు ఊచలు లెక్క పెట్టకుండానే బయటకు వచ్చేశారు.

Related posts

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N