NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Tummala Nageswararao: రాహుల్ గాంధీతో మాజీ మంత్రి తుమ్మల భేటీ

Share

Tummala Nageswararao: ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ మంత్రి, సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. రాహుల్ ను కలిసి దుశ్సాలువాతో సత్కరించారు. అధికార బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన తుమ్మల నాగేశ్వరరావు గత నెల కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో తుమ్మల కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. అయితే ఆ రోజు రాహుల్ గాంధీ సమయం ఇవ్వలేకపోవడంతో తుమ్మల కలవలేకపోయారు.

ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీతో భేటీ అయ్యేందుకు కాంగ్రెస్ అధిష్టానం నుండి పిలుపు వచ్చింది. కేసీ వేణుగోపాల్ పిలుపు మేరకు ఢిల్లీకి వెళ్లిన తుమ్మల నాగేశ్వరరావు .. రాహుల్ గాంధీ తో సమావేశమైయ్యారు. ఈ క్రమంలో సుమారు అరగంట పాటు రాహుల్ గాంధీ తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఇరువురు నేతలు కీలక చర్చలు జరిపారు. అదే విధంగా ఖమ్మం జిల్లాలోని పరిస్థితులు, రాజకీయ వ్యూహంపై కూడా చర్చించారు. అంతే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో రాజకీయ పరిస్థితులపైనా చర్చించినట్లు సమాచారం.

దాదాపు మూడున్నర దశాబ్దాలకు పైగా క్రియాశీల రాజకీయాల్లో ఉన్న తుమ్మల నాగేశ్వరరావు అయిదు సార్లు ఎమ్మెల్యేగా, ఒక సారి ఎమ్మెల్సీగా బాధ్యతలు నిర్వహించారు. ఎన్టీఆర్, చంద్రబాబు, కేసిఆర్ కేబినెట్ లలో మంత్రిగా సేవలు అందించారు. 1983 టీడీపీ ఆవిర్భావం నుండి 2014 వరకూ ఆ పార్టీలో ఉన్న తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర విభజన తర్వాత 2014లో టీఆర్ఎస్ లో చేరారు.

గత నెల 14వ తేదీన బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. ఆ తర్వాత రెండు రోజులకు కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల పట్ల పూర్తి అవగాహన ఉన్న సీనియర్ నేత కావడంతో ప్రత్యేకంగా పిలిపించి రాహుల్ గాంధీ మాట్లాడినట్లుగా తుమ్మల అనుచర వర్గం నేతలు పేర్కొంటున్నారు.

IND Vs PAK: భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్ .. మోడీ స్టేడియానికి చేరుకున్న సచిన్, అనుష్క శర్మ


Share

Related posts

Bath Powder: సబ్బుకు బదులు ఈ సున్నిపిండి వాడండి.. ఎవ్వరూ గుర్తుపట్టలేనంతగా తెల్లగా మారిపోతారు..!!

bharani jella

Samantha: సమంతపై కన్నేసిన ప్రియమణి భర్త.. అందులో తప్పేముంది అంటూ ప్రియమణి సపోర్ట్.!

Ram

AP Govt: సర్పంచ్‌లకు జగన్ సర్కార్ షాక్..! ఇచ్చిన హామీ నెరవేర్చలేదు..! ఉన్న డబ్బు ఊడ్చేశారు..!!

somaraju sharma