NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

KTR: మాజీ మంత్రి పొన్నాలను బీఆర్ఎస్ లోకి ఆహ్వానించిన మంత్రి కేటిఆర్

Share

KTR: సీనియర్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. నిన్ననే పొన్నాల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాజీనామా లేఖను పార్టీ అధిష్టానానికి పంపించారు. ఇదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీలోని ప్రస్తుత పరిణామాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు, ఆరోపణలు చేశారు. ఇదే అదునుగా పొన్నాలను బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకునేందుకు ఆ పార్టీ సన్నద్దం అయ్యింది. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసిఆర్ సూచనల మేరకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటిఆర్ శనివారం పొన్నాల నివాసానికి వెళ్లారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ తో కలిసి కేటీఆర్ .. హైదరాబాద్ లోని పొన్నాల నివాసానికి వెళ్లి బీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు.

పొన్నాలతో భేటీ అనంతరం కేటిఆర్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటి పీసీసీ అధ్యక్షుడు, సీనియర్ రాజకీయ వేత్త పొన్నాల లక్ష్మయ్యను సీఎం కేసిఆర్ సూచనల మేరకు బీఆర్ఎస్ లోకి ఆహ్వానించడం జరిగిందన్నారు. బీఆర్ఎస్ లో ఆయనకు సముచిత గౌరవం, ప్రాధాన్యత కల్పిస్తామని పేర్కొన్నారు. పొన్నాల ఆదివారం సీఎం కేసిఆర్ ను కలుస్తారని చెప్పారు. జనగామలో జరిగే బహిరంగ సభలో బీఆర్ఎస్ చేరాలని కోరగా, సుముఖత వ్యక్తం చేశారని కేటిఆర్ తెలిపారు. ఆదివారం సీఎం కేసిఆర్ తో మాట్లాడిన తర్వాత తన నిర్ణయాన్ని ప్రకటిస్తారని పొన్నాల చెప్పారన్నారు.

బలహీన వర్గాలకు చెందిన అనేక మంది నాయకులకు ఇప్పటికే సీఎం కేసిఆర్ ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని కేటిఆర్ తెలిపారు. 1960లోనే అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం చేసిన పొన్నాల .. నాసా లాంటి అంతర్జాతీయ సంస్థలో ఇంజనీర్ గా పని చేశారనీ, సమాజంలో గొప్పగా పని చేసిన నాయకుడని అన్నారు. మాజీ ప్రధాని పీవీ నర్శింహరావు ఆహ్వానం మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరి సుదీర్ఘ కాలం పాటు ప్రజా సేవ చేశారన్నారు. వయసులోనే పెద్ద, బలమైన బీసీ నాయకుడిని పీసీసీ అధ్యక్షుడు తూలనాడిన విధానాన్ని ప్రజలు అసహ్యించుకుంటున్నారని మంత్రి కేటిఆర్ అన్నారు.


Share

Related posts

Breaking: విజయవాడలో ఐటీ సోదాల కలకలం .. వైసీపీ నేతల నివాసాల్లో…

somaraju sharma

RRR: సకల శాఖల మంత్రి..? సజ్జలపై ఎంపి రఘురామ సెటైర్..!!

somaraju sharma

ఆపరేషన్-2024.! ఏపీలో బీజేపీ “కాపు”రం..! వంగవీటి సహా కీలక నేతలు జంప్..!

Srinivas Manem