Bigg Boss 17: ప్రపంచవ్యాప్తంగా టెలివిజన్ రంగంలో బిగ్ బాస్ షోకి మంచి క్రేజ్ ఉంది. ఇండియాలో ఫస్ట్ టైం హిందీలో షో ప్రారంభమైంది తర్వాత సౌత్ లో ప్రసారం కావడం జరిగింది. తెలుగులో ఇప్పటివరకు ఆరు సీజన్స్ కంప్లీట్ అయ్యాయి. ప్రస్తుతం ఏడవ సీజన్ రన్ అవుతుంది. సగం సీజన్ కంప్లీట్ కావడం జరిగింది. హౌస్ లో సభ్యులకు చూస్తున్న ఆడియన్స్ కి అతి పోయే రీతిలో రకరకాల ట్వీస్ట్ లతో సాగుతోంది. ఉల్టా పుల్టా అన్న రీతిలోనే.. కొత్త కొత్త రూల్స్ తో సీజన్ సెవెన్ ప్రసారం అవుతూ ఉంది. ఇదిలా ఉంటే ఇప్పుడు తెలుగుతోపాటు తమిళ్ ఇంకా కన్నడ బిగ్ బాస్ రియాల్టీ షో ప్రారంభమైన సంగతి తెలిసిందే.
ఇదే సమయంలో ఇప్పుడు హిందీలో అక్టోబర్ 15వ తారీఖు నుండి బిగ్ బాస్ హిందీ సీజన్ 17 ప్రారంభమవుతుంది. కాగా ఎప్పటిలాగానే ఈ షో కి సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. అయితే ఈసారి హిందీ బిగ్ బాస్ లో కొత్త రూల్ ప్రవేశపెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. మేటర్ లోకి వెళ్తే హిందీ బిగ్ బాస్ లో పోటీదారులు మొబైల్ ఉపయోగించుకునేందుకు అనుమతించినట్లు సమాచారం. దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.. మామూలుగా అయితే బిగ్ బాస్ షోలో పోటీదారులు ఒకసారి హౌస్ లోకి వెళ్తే బయట ప్రపంచంతో సంబంధాలు ఏమి ఉండవు.
మొబైల్ కూడా వాడే పరిస్థితి ఉండదు. అదేవిధంగా బయట జరుగుతున్న విషయాలు ఏమీ కూడా ఇంట్లో సభ్యులకు తెలిసే పరిస్థితి ఉండదు. కానీ హిందీ బిగ్ బాస్ సరికొత్త ప్రయోగానికి సిద్ధమయ్యారు. కంటెస్టెంట్స్ మొబైల్ ఫోన్లు వాడేందుకు అనుమతిస్తూ షో నడిపించాలని డిసైడ్ అయ్యారట. వన్డే వరల్డ్ కప్ టోర్నీ జరుగుతూ ఉండటంతో… హిందీ బిగ్ బాస్ షో నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.