NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ ప్ర‌పంచం

IND Vs PAK: భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్ .. మోడీ స్టేడియానికి చేరుకున్న సచిన్, అనుష్క శర్మ

IND Vs PAK:  ప్రపంచ కప్ లో అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మెగా సమరం కొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. ఉత్కంఠ, భారీ అంచనాల నడుమ అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగే లీగ్ మ్యాచ్ లో భారత్, పాకిస్తాన్ తలపడునున్నాయి. ఈ మ్యాచ్ లో గెలిస్తే  వన్డే వరల్డ్ కప్ మ్యాచ్ లలో భారత్ ఆధిక్యం మరింత పెరుగుతుంది. పాక్ ను భారీ తేడాతో ఓడించి అభిమానులకు గిఫ్ట్ ఇవ్వాలని భావిస్తున్నారు కెప్టెన్ రోహిత్ శర్మ. ఇండియా  – పాకిస్థాన్ రసవత్తర పోరును కళ్లారా వీక్షించందుకు జార్జియా, నేపాల్, ఇంగ్లండ్ సహా పలు దేశాల నుండి అభిమానులు భారీ గా తరలివచ్చారు.

మరో పక్క ఇవాళ జరిగే ఇండియా – పాక్ మ్యాచ్ లో భారత్ గెలుపు కోసం అభిమానులు పూజలు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లోని పలు ఆలయాల్లో ప్రత్యేక అభిషేకాలు చేస్తున్నారు. చిరకాల ప్రత్యర్ధిని చిత్తు చేసి జాతీయ జెండా రెపరెపలాడాలని ఆకాంక్షిస్తున్నారు. అందుకోసం మువ్వన్నెల జెండా చేతపట్టి హోమాలు చేస్తున్నారు. నరేంద్ర మోడీ స్టేడియంలో మరి కొద్ది గంటల్లో జరిగే ఇండియా – పాక్ మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు ప్రముఖులు క్యూకడుతున్నారు. ఇప్పటికే విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ, సచిన్ టెండూల్కర్ అహ్మదాబాద్ చేరుకున్నారు. దేశ వ్యాప్తంగా ఇండియా –  పాక్ మధ్య జరిగే మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నారు.

ఈ మ్యాచ్ లో భారత్ విజయం ఖాయమని క్రీడాకారులు, అభిమానులు చెబుతున్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా టీమిండియా గెలుపుకు ముందే జాతీయ జెండా పట్టుకుని సంబరాలు జరుపుకుంటున్నారు. మ్యాచ్ ప్రారంభానికి గంటల ముందే అభిమానులు నరేంద్ర మోడీ స్టేడియానికి పొటెత్తుతున్నారు. జాతీయ జెండాలతో పాటు ఇండియా జెర్సీలతో భారీగా తరలివస్తున్నారు. ఇండియా – పాక్ మధ్య హైటెన్షన్ మ్యాచ్ తో పోలీసులు భద్రత మరింత పెంచారు. అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం దగ్గర వందలాదిగా పోలీసులు మోహరించారు .మ్యాచ్ కోసం ప్రముఖులు తరలివస్తున్న నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు.

గత దశాబ్ద కాలంగా భారత గడ్డపై ఇండియా వర్సెస్ పాకిస్థాన్ వన్డే మ్యాచ్ లు ఆడలేదు. దీనికి తోడు ప్రస్తుత వరల్డ్ కప్ లో ఇరు జట్లు చాలా బలంగా ఉన్నాయి. రెండు జట్లు రెండేసి విజయాలు సాధించి హ్యాట్రిక్ విజయంపై కన్నేశాయి. కావున అందరి దృష్టి ఇవేళ జరిగే మ్యాచ్ పైనే ఉంది. ఈ మ్యాచ్ ను దాదాపు 1.50 లక్షల మంది అభిమానులు ప్రత్యక్షంగా వీక్షించనున్నారు. దేశ విదేశాల్లో ఉన్న దాదాపు 150 కోట్ల మంది భారతీయులు ఉత్సాహంగా క్రికెట్ మ్యా ను వీక్షించడానికి రెడీ అవుతున్నారు.

మరో వైపు ఈ మ్యాచ్ కొందరికి కాసుల వర్షం కురిపిస్తొంది. ముఖ్యంగా ఓటీటీ యాప్ డిస్నీ హాట్ స్టార్ ఈ మ్యాచ్ తో భారీ ప్రయోజనం పొందుతుంది. ఈ మ్యాచ్ ను ప్రసారం చేస్తున్న డిస్నీ – హాట్ స్టార్ కేవలం ప్రకటనల ద్వారా రూ.150 కోట్లకు పైగా వ్యాపారం చేసినట్లుగా వార్తలు వినబడుతున్నాయి. నాలుగేళ్ల క్రితం ఇంగ్లండ్ లో జరిగిన ప్రపంచ కప్ లో ఇండియా – పాకిస్తాన్ మ్యాచ్ లో సాధించిన ఆదాయం కంటే దాదాపు రూ.50 కోట్లు ఎక్కువ.

Teenmar Mallanna: కొడంగల్ బరి నుండి తీన్మార్ మల్లన్న..?

Related posts

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju