NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Teenmar Mallanna: కొడంగల్ బరి నుండి తీన్మార్ మల్లన్న..?

Share

Teenmar Mallanna: తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ .. వచ్చే ఎన్నికల్లో మేడ్చల్ నియోజకవర్గం నుండి పోటీ చేస్తానని గతంలో నాలుగు నెలల క్రితం చెప్పారు. అయితే అప్పుడు ఏ పార్టీ నుండి పోటీ చేస్తాననే దానిపై క్లారిటీ ఇవ్వలేదు. రాష్ట్రంలో ప్రశ్నించే గొంతు మిగిలి  ఉండాలంటే తనపై విపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ అభ్యర్ధులను పోటీకి నిలుపొద్దని మల్లన్న విజ్ఞప్తి చేశారు. జర్నలిస్ట్ గా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూనే రాజకీయాల్లో రాణించేందుకు తొలుత కాంగ్రెస్, ఆ తర్వాత బీజేపీలో చేరినా తీన్మార్ మల్లన్న ఆ పార్టీల్లో ఇమడలేకపోయారు.

తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత తీన్మార్ మల్లన్న వీ 6 న్యూస్ ఛానల్ లో తన ఉద్యోగానికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2015 లో తెలంగాణ శాసనమండలికి జరిగిన ఎన్నికల్లో నల్లగొండ – ఖమ్మం – వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి పరాజయం పాలైయ్యారు. తర్వాత 2019లో జరిగిన హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసి ఓటమి పాలైయ్యారు. ఆ తర్వాత 2021 మార్చిలో జరిగిన శాసనమండలి ఎన్నికల్లో నల్లగొండ – ఖమ్మం – వరంగల్లు పట్టభధ్రుల ఎమ్మెల్సీ స్థానం నుండి స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసి రెండవ సారీ ఓటమి పాలైయ్యారు. అయితే ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్ధులకు గట్టి పోటీ ఇచ్చి చెమటలు పట్టించారు. రెండో స్థానంలో నిలిచారు. టీజేఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు కోదండరామ్, బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్ధులను వరుసగా, మూడు, నాలుగు, అయిదు స్థానాల్లో నిలబెట్టారు.

2021 డిసెంబర్ నెలలో ఢిల్లీలో తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జి తరుణ్ చుగ్ ఆధ్వర్యంలో బీజేపీ లో చేరారు తీన్మార్ మల్లన్న. ఆ తర్వాత అయిదు నెలలకే ఆ పార్టీ నుండి బయటకు వచ్చేశారు. తదుపరి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. మరో వైపు సొంత పార్టీని స్థాపించి సొంత ఎజెండాతో స్వతంత్రంగా ప్రజల్లోకి వెళ్లాలని, తన టీమ్ సభ్యులను కూడా ఎన్నికల బరిలోకి దింపాలని నిర్ణయించుకున్నారు. ఆ క్రమంలోనే కొత్త పార్టీ పెట్టేందుకు ప్రయత్నాలు చేశారు. తెలంగాణ నిర్మాణ పార్టీ అనే పేరుతో పార్టీ పెడుతున్నట్లుగా మల్లన్న గతంలో ప్రకటించారు. ఆ మేరకు పార్టీ పేరును రిజిస్టర్ కూడా చేయించారు. అయితే సాంకేతిక కారణాల వల్ల అది ఆలస్యం కావడంతో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరపున ఆయన పోటీ చేయనున్నారని తెలుస్తొంది. ఈ పార్టీ రాష్ట్ర బాధ్యతలు అప్పగించడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్ధుల ఎంపిక బాధ్యతను కూడా తీన్మార్ మల్లన్నకే అప్పగించిందనీ, ఆ పార్టీ తరపున ఆయనే సీఎం అభ్యర్ధి అని కూడా చెపుతున్నారు.

గతంలో మెడ్చల్ నియోజకవర్గం నుండి మంత్రి మల్లారెడ్డి పై పోటీ చేస్తానని తీన్మార్ మల్లన్న ప్రకటించారు. అయితే మేడ్చల్ లో 2018 ఎన్నికల్లో కాంగ్రెస్, బీఎస్పీ, బీజేపీ అభ్యర్ధులు పోటీ ఉన్నప్పటికీ టీఆర్ఎస్ అభ్యర్ధిగా బరిలో నిల్చిన మల్లారెడ్డి 87వేల ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. తీన్మార్ మల్లన్న తనపై పోటీ చేస్తే డిపాజిట్ లు కూడా రావని మల్లారెడ్డి నాడు కామెంట్స్ చేశారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం తీన్మార్ మల్లన్న కొడంగల్ నియోజకవర్గం నుండి పోటీ చేయాలని భావిస్తున్నారుట. ఈ విషయాన్ని మల్లన్న టీమ్ జిల్లా అధ్యక్షుడు ఘనపురం శ్రీనివాస్ వెల్లడించారు.

కొడంగల్ నియోజకవర్గం నుండి వరుసగా 2009, 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధిగా గెలిచిన రేవంత్ రెడ్డి అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి కేవలం 9,319 ఓట్ల తేడాతో టీఆర్ఎస్ అభ్యర్ధి పట్నం నరేందర్ రెడ్డి చేతిలో పరాజయం పాలైయ్యారు. అయితే తీన్మార్ మల్లన్న గతంలో ప్రకటించినట్లు మేడ్చల్ నియోజకవర్గం నుండి పోటీ చేస్తారా లేక కోడంగల్ నియోజకవర్గం నుండి పోటీ చేస్తారా అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.

Ponnala: కాంగ్రెస్ లో తారాస్థాయికి చేరిన టికెట్ల లొల్లి .. బీసీ నేతలకు అన్యాయం జరుగుతోందంటూ పార్టీ గుడ్ బై చెప్పిన సీనియర్ నేత పొన్నాల .. వస్తానంటే ఇంటికి అహ్వానిస్తానన్న మంత్రి కేటిఆర్


Share

Related posts

‘సీఎస్ బదిలీపై పిల్!’

somaraju sharma

17 వరకూ ఏపి అసెంబ్లీ సమావేశాలు

somaraju sharma

ఎఫ్ 3 దిల్ రాజు కి అప్పుడే ఇంత లాభం తెచ్చిపెట్టిందా ..?

GRK