Krishna Mukunda Murari: కృష్ణ చెప్పిన మాటలన్నీ భవానీ దేవి ఆలోచిస్తూ, కృష్ణ అచ్చం నాలానే ఆలోచిస్తుంది, ఇంటి కోడలిగా తన బాధ్యతలని నెరవేరుస్తుంది. తొందరపాటులో నేను తీసుకున్న నిర్ణయాన్ని, ఇంటి కోడలిగా గుర్తించి ఆదర్శ తిరిగి తీసుకురావడానికి, తన వంతు ప్రయత్నం చేస్తుంది. తను చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్టుగా ఉంటుంది. ఇంక నేను ఎందుకు భయపడాలి తను అనుకున్నది అంటే కచ్చితంగా చేస్తుంది. ఆదర్శం తిరిగి ఇంటికి వస్తాడు కాదు ఇంటికి కృష్ణ ఆదర్శ్ ని తిరిగి తీసుకొస్తుంది ఆ నమ్మకం నాకుంది కృష్ణ మీద ఉన్న నమ్మకాన్ని నేను వదులుకోకూడదు. ఒక వారం రోజులు ఎదురు చూస్తే ఆదర్శ్ నీ నేరుగా చూడవచ్చు. కృష్ణ మీద నాకు నమ్మకం ఉంది అని భవాని మనసులో అనుకుంటుంది.

కృష్ణ ఏదో ఆలోచిస్తూ ఉండగా రేవతి అక్కడికి వచ్చి మురారి అక్కడికి వెళ్ళాడు అని అడుగుతుంది. ఏసీబీ సార్ గురించి నేను ఆలోచిస్తున్నాను అత్తయ్య మీకు ఏమీ చెప్పలేదని కృష్ణ అంటుంది. నీకు ఏమైనా సర్ప్రైజ్ ఇవ్వడానికి వెళ్ళాడేమో అని రేవతి అంటుంది. నా బొంద సర్ప్రైజ్ అత్తయ్య అని కృష్ణ అంటుంది. ఇలా ఎందుకు ఆలోచించకూడదు నేను పెద్ద అత్తయ్యకి ఆదర్శ్ ని తీసుకువస్తానని మాట ఇచ్చాను కదా, మురారి ఆ మాట నిలబెట్టుకోవడం కోసం ఆదర్శ్ ని వెతకడానికి వెళ్ళాడేమో ఒకవేళ ఆదర్శ్ ని తీసుకువచ్చి మనందరికీ సర్ప్రైజ్ ఇస్తాడేమో అని కృష్ణ అంటుంది. నేను కూడా ఇందాక అదే చెప్తే నా బొంద అన్నావుగా అని రేవతి అంటుంది. అప్పుడే భవాని అక్కడికి వస్తుంది. అప్పుడు మురారి ఏడి అని అడగగా ఏదో క్యాంపు కి వెళ్ళాడు అని కృష్ణ చెబుతుంది. కానీ మురారి కచ్చితంగా ఆదర్శ్ ని వెతకడానికే వెళ్లి ఉంటాడు అని మా గట్టి నమ్మకం అని కృష్ణ అంటుంది. మీరిద్దరూ భలే చూడముచ్చటైన జంట కృష్ణ. వాడిని నువ్వు గౌరవిస్తావు. నీ మాటలని వాడు గౌరవించాడు. నువ్వు మాట ఇస్తే నీ మాట నిలబెట్టడం కోసం వాడు ఆదర్శ్ నీ వెతకడానికి వెళ్లాడు. మీరు ఇద్దరు ఎప్పుడూ ఇలాగే ఉండాలి.

ఆదర్శ్ తిరిగి వచ్చిన తర్వాత మీ రెండు జంటలకి గ్రాండ్గా రిసెప్షన్ ఏర్పాటు చేస్తాను. నా కోడల్ని అందరికీ పరిచయం చేస్తాను అని కృష్ణుని ఉద్దేశించి అంటుంది భవానీ దేవి. ఏంటి రేవతి నువ్వేమీ మాట్లాడవు అని భవాని అడగగా.. చాలా సంతోషంగా ఉంది అక్క అని అంటుంది. మీరు ఇలాగే నమ్మకంతో ఉండండి పెద్ద అత్తయ్య మీ నమ్మకాన్ని వమ్ము కాకుండా మేము ఇద్దరం చూసుకుంటాము అని కృష్ణ భవానితో అంటుంది.

కృష్ణ, తులసి కోటకు పూజ చేసి లోపలికి వస్తుండగా ముకుందా ఎదురవుతుంది. ఏంటి తులసమ్మకు ఏం అప్లికేషన్ పెట్టవు నువ్వు ఎన్ని అప్లికేషన్లు పెట్టిన ఎన్ని రికమండేషన్స్ చేసినా ఉపయోగమే లేదు. దేవుళ్ళు దేవతలు అందరూ నా వైపే ఉన్నారు అని ముకుందా అంటుంది. నేను ఇంతకుముందే తులసమ్మకు మొక్కుకున్నాను అని ముకుందా అంటుంది ఎవరు ముందుగా మొక్కుకుంటే దేవుడు వాళ్ల మొక్కులునే తీరుస్తారు కదా అని కాన్ఫిడెంట్ గా చెబుతుంది ముకుంద. నీ పగటి కలలన్నీ పక్కన పెట్టు ముకుందా.. నీకున్న ఆప్షన్ ఒక్కటే అదే ఆదర్శ్ అని గుర్తు పెట్టుకో కృష్ణ అంటుంది. కృష్ణ చాలా నమ్మకంతో ఉన్నావు అని అంటుంది. పరాయి మగాడి గురించి అనే కృష్ణ అంటుండగా షట్ అప్ జస్ట్ షట్ అప్ నా మురారి ఎప్పుడు నాకు పరాయి వాడు కాదు అని ముకుందా అంటుంది.

నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థం అవుతుందా.. నీ మనస్సాక్షిని అడుగు నువ్వు చెప్పింది అబద్ధం అని నాకు తెలుసు దాని నిరూపిస్తాను అని కృష్ణ అంటుంది. నా మనసు నిండా మురారి ఉన్నాడు అని అతడు తన సొంతమని కృష్ణతో అంటుంది ముకుంద. అది చూద్దామని కృష్ణ ముకుందా ఇద్దరు సవాల్ చేసుకొనుగా, ముకుంద కృష్ణకు నీకు దమ్ముంటే నా ప్రేమ సంగతి భవానీ దేవికి చెప్పు అని అంటుంది. నువ్వు చెప్పలేవు నాకు తెలుసు కృష్ణ అని ముకుందా అంటుంది నాకు సంస్కారం ఉంది. అందుకే చెప్పడం లేదు. నీలాంటి సంస్కారహీనులకి అలాంటి విషయాలు చెప్పినా అర్థం కాలే అని కృష్ణ అంటుంది. నాకు పెళ్లి బంధం మీద నమ్మకం ఉంది. దానిని ఆ దేవుడు కూడా మార్చలేడు.

కృష్ణ అటుగా వెళుతుండగా ముకుంద ఫోన్ మోగుతూ ఉంటుంది. ముకుంద ఫోన్లో గీతిక అనే పేరు చూడగానే ముకుందా ఏదో నాటకం ఆడుతున్నట్టుంది. అది ఏంటో తెలుసుకోవాలని చెప్పి గీతికా ఫోన్ చేస్తుండగా ఫోన్ లిఫ్ట్ చేస్తుంది కృష్ణ. ముకుంద మాట్లాడవేంటి నీ పక్కన ఎవరైనా ఉన్నారా? సరే అయితే నేను చెప్పేది విను అని మనం ఆ సైనిక్పురి లో ఒక అతని చేత నాటకం ఆడించాం కదా.. అతను ఇంకేమైనా వేషాలు ఉంటే ఇప్పించండి అమ్మ అంటూ తెగ ఫోన్ చేసి విసిగిస్తున్నాడు. నీకు కూడా ఫోన్ చేస్తే ఇంకా ఉంటే ఏమైనా చెప్తాను అని కాల్ కట్ చేయు. లేదంటే ఆ నంబర్ ని బ్లాక్ చేయమని గీతిగా చెబుతుంది. కృష్ణ ఆ మాటలు విని షాక్ అవుతుంది. అంటే ఆదర్శ్ గురించి మురారితో చెప్పిందంతా అబద్ధం అని కృష్ణ తెలుసుకుంటుంది. ముకుంద గురించి నాకు ముందు నుంచి అనుమానమే మొత్తానికి నేను అనుకున్నదే నిజమైంది. ముకుందా ఇదంతా కావాలని చేసింది అని కృష్ణ అనుకుంటుంది. ఇక వెంటనే ఈ విషయాన్ని మధు తో చెప్పి అసలు ఆ నాటకం ఆడిన అతను ఎక్కడ ఉన్నాడో వెతకమని మధుతో చెబుతుంది. ఇక మధు క్షణం కూడా ఆలస్యం చేయకుండా అతనిని వెతికి తీసుకురావడానికి సైనిక్పురి బయలుదేరుతాడు. అతనిని వెతికి తీసుకువచ్చి అసలు విషయాన్ని భవాని అత్తయ్య ముందు ఆదర్శ్ గురించి చెప్పించి ఇదంతా నాటకమని తన బాధను తగ్గించాలని, ముకుంద నిజస్వరూపం భవానికి తెలియాలని కృష్ణ అనుకుంటుంది.

ఇక తరువాయి భాగంలో ఇంట్లో అందరి ముందు భవానీ దేవి ముకుంద చంప చెల్లుమని కొడుతుంది. ఎందుకు అబద్ధం చెప్పావని భవాని ముకుందని అడుగుతుంది ఆదర్శ అంటే ఇష్టం లేక.. మరి అలాంటప్పుడు పెళ్లి ఎందుకు చేసుకున్నావ్ అని అడుగుతుంది.. నా మనసు చచ్చిన నా ప్రేమ బతికి ఉంటుందని.. ఛి ఛి పెళ్లయిన తర్వాత ప్రేమ ఏంటి రేవతి అని భవాని అంటుంది. నేను వీళ్ళ అందరి లాగా మీకు అబద్దం చెప్పలేదు. కృష్ణ మురారి వాళ్లది అగ్రిమెంట్ మ్యారేజ్, వాళ్ళు ఒక సంవత్సరం భార్య భర్తల కాపురం చేస్తున్నారు ఉన్న విషయాన్ని కుండ బద్దలు కొడుతుంది.